వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవభూమిలో బీఫ్ డిష్: పర్యాటక శాఖపై వీహెచ్‌పీ గరం: గో ప్రేమికుల మనోభావాలతో ఆటలా అని ఫైర్

|
Google Oneindia TeluguNews

కేరళ పర్యాటక శాఖపై విశ్వహిందూ పరిషత్ ఒంటికాలిపై లేచింది. ఇటీవల కేరళ టూరిజం పర్యాటకులకు ఆకర్షించడంలో భాగంగా బీఫ్ డిష్ వంటకానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై వీహెచ్‌పీ స్పందిస్తూ.. ఓ మతస్తుల మనోభావాలను కించపరచడం సరికాదని మండిపడింది.

బీఫ్ డిష్..

బీఫ్ డిష్..


పర్యాటకులను ఆకర్షించేందుకు బుధవారం రోజున ట్విట్టర్‌లో బీఫ్ డిష్ ఫోటోలను కేరళ టూరిజం శాఖ పోస్ట్ చేసింది. అందులో ‘సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ముక్కలతో కాల్చిన గొడ్డు మాంసం, కరివేపాకులు వేసి రుచికరంగా అందజేయబోతున్నాం' అని పేర్కొన్నది. కేరళకు పర్యాటకులను ఆకట్టుకోవడమేనని చెప్పినా.. హిందువులను ఇబ్బందికి కలిగించేలా ఉందని వీహెచ్‌పీ మండిపడింది.

పర్యాటకమా..? బీఫ్ ప్రమోటా..?

పర్యాటకమా..? బీఫ్ ప్రమోటా..?

పర్యాటక శాఖ పోస్ట్ చేసిన ఫోటో యొక్క అర్థం ఏమిటి అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ప్రశ్నించారు. ఇది కేరళ పర్యటకాన్ని ప్రమోట్ చేసే మాదిరిగా ఉందా ? లేదంటే గొడ్డు మాంసాన్ని ప్రమోట్ చేసేలా ఉందా అని అడిగారు. కానీ ఓ మతస్తులను, గోవులను ప్రేమించేవారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది అని మండిపడ్డారు. కేరళ పవిత్ర భూమి అని, ఇక్కడే శంకరాచార్య జన్మించారని.. అంతటి విశిష్టత ఉన్న స్థానంలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

గవర్నర్‌కు ట్వీట్ ట్యాగ్

కేరళ టూరిజం చేసిన ట్వీట్‌ను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ పర్యాటకశాఖ మంత్రి కడకమ్‌పల్లి సురేంద్రన్‌కు ట్యాగ్ చేశారు. ఫోటోపై కేరళ పర్యాటక శాఖను సలహా ఇవ్వామని అందులో కోరారు. వీరితోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పర్యాటకశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కేరళ పర్యాటక శాఖ ట్వీట్ చేసిన ఫోటోను వినోద్ బన్సాల్ ట్యాగ్ చేశారు.

సంక్రాంతి సమయంలో..

సంక్రాంతి సమయంలో..

మకర సంక్రాంతి, పొంగల్, బిహు పండగలను దక్షిణ భారతదేశంలో పెద్ద పండుగలు. సరిగ్గా పండగ సమయంలోనే కేరళ టూరిజం బీఫ్ ఫోటోలు ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది.

English summary
kerala Tourism on social media website Twitter posted a tweet on Wednesday about a beef dish eaten in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X