వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో భర్తతో కలిసి.. ఆస్తి కోసం భర్తను, బంధువులను చంపి..! 17 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు మరిచి డబ్బు మోజులో పడుతున్నారు. చివరకు అయినవారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని పరిస్థితి దాపురించింది. కేరళలో 2002 నుంచి 2016 వరకు జరిగిన ఆరుగురి హత్య కేసులో భయానక నిజాలు వెలుగు చూశాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ కేసును పోలీసులు చేధించడం చర్చానీయాంశమైంది. భర్తతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన నిందితురాలిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

కోజికోడ్‌లో వరుస హత్యలు.. 2002 నుంచి 2016 దాకా

కోజికోడ్‌లో వరుస హత్యలు.. 2002 నుంచి 2016 దాకా

కేరళలోని కోజికోడ్‌లో 2002 నుంచి 2016 వరకు జరిగిన వరుస హత్యలు కలకలం రేపాయి. పధ్నాలుగేళ్లలో ఆరు సీరియల్ మర్డర్స్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అదలావుంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ కేసు చిక్కుముడి వీడింది. భర్తతో పాటు ఐదుగురు బంధువులను హతమార్చిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం ఆస్తి కోసం ఆరుగురిని పొట్టనబెట్టుకున్న వైనం మరోసారి హాట్ టాపికైంది.

ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!

అత్తగారి కుటుంబం ఆస్తి కొట్టేయడానికి కోడలి ప్లాన్

అత్తగారి కుటుంబం ఆస్తి కొట్టేయడానికి కోడలి ప్లాన్

పొన్నమట్టం అన్నమ్మ థామస్ టీచర్‌గా పనిచేశారు. 2002 సంవత్సరంలో రిటైరయ్యారు. ఆ క్రమంలో అత్తగారి కుటుంబ ఆస్తిపై కన్నేసిన ఆ ఇంటి కోడలు జోలీ వరుస హత్యలకు శ్రీకారం చుట్టింది. అత్తను, భర్తను చంపిన తర్వాత ఆస్తికి అడ్డు రాకుండా మరో నలుగురు బంధువులను సైతం మర్డర్ చేసింది. 2002లో అన్నమ్మ చనిపోయినప్పుడు అందరూ సహజ మరణంగా భావించారు. అది జరిగిన ఆరేళ్ల తర్వాత అంటే 2008లో ఆమె భర్త టామ్ థామస్ కన్నుమూశారు. అదే క్రమంలో 2011లో జోలీ భర్త రాయ్ థామస్ కూడా చనిపోయారు.

పథకం ప్రకారం ఒక్కొక్కరని మట్టుబెడుతూ..!

పథకం ప్రకారం ఒక్కొక్కరని మట్టుబెడుతూ..!

పథకం ప్రకారం ఒక్కొక్కరిని మట్టుబెట్టుకుంటూ వచ్చిన జోలీకి ఆమె రెండో భర్త షాజు సహకరించాడు. ఇతను ఆమె బంధువుల కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. అదలావుంటే 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్‌ కూడా జోలీ మామ, భర్త చనిపోయిన రీతిలో మృత్యువాత పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే క్రమంలో 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల చిన్నారి అల్ఫాన్సా గుండె పోటుతో మరణించడం.. అది జరిగిన కొద్ది నెలలకే ఆ పాప తల్లి సిల్లీ కూడా చనిపోవడం ఆ ఇంట్లో భయాందోళనలు రేకెత్తించింది. వరుసగా చనిపోతున్న తీరు అప్పట్లో సంచలనంగా మారింది.

<strong>క్లాస్ రూమ్‌లో దర్జాగా.. సిగరెట్ కాల్చిన టీచర్, చివరకు..!</strong><br />క్లాస్ రూమ్‌లో దర్జాగా.. సిగరెట్ కాల్చిన టీచర్, చివరకు..!

ఆరుగురి హత్య కేసు దుమారం.. ఆస్తి కోసం దారుణం

ఆరుగురి హత్య కేసు దుమారం.. ఆస్తి కోసం దారుణం

కోజికోడ్‌లో జరిగిన ఈ వరుస హత్యల కేసు దుమారం రేపింది. స్థానిక పోలీసులకు సవాల్ విసిరింది. ఆరుగురి హత్యలు సహజ మరణంగా కనిపించినా.. దాని వెనుక ఏదో కుట్ర దాగుందన్న పోలీసుల అనుమానం చివరకు నిజమైంది. అన్నమ్మ కోడలు జోలీ ఈ సీరియల్ కిల్లింగ్స్ సూత్రధారిగా తేలింది. కేవలం ఆస్తి కోసం కుటుంబ సభ్యులను, బంధువులను ఈ విధంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2002 నుంచి సాగిన ఈ హత్యకాండ 2016 వరకు ఆరుగురిని పొట్టన పెట్టుకుంది.

రెండేళ్ల చిన్నారిని కూడా వదల్లేదుగా..!

రెండేళ్ల చిన్నారిని కూడా వదల్లేదుగా..!

రెండేళ్ల చిన్నారి అల్ఫాన్సా చనిపోయిన తర్వాత తల్లి కూడా మృత్యువాత పడింది. ఆ నేపథ్యంలో సిల్లీ భర్త షాజూను రెండో వివాహం చేసుకుంది జోలీ. అయితే వీరిద్దరికీ అంతకు ముందే వివాహేతర సంబంధముందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇద్దరూ కలిసి ఆస్తి కోసం ఇలా చేశారా లేదంటే జోలీ స్కెచ్ ప్రకారమే షాజూ సహకరించాడా అనే విషయం తేలాల్సి ఉంది. మొత్తానికి ఆమెతో పాటు రెండో భర్త షాజును మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆరు హత్యల్లో కూడా సైనేడ్‌తో విష ప్రయోగం చేసినట్లు తేలింది. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు జోలీ పక్కా స్కెచ్‌ను పోలీసులు పసిగట్టలేకపోయారు.

ముఖాలకు ముసుగులు.. మొన్న మాస్క్‌లు, నేడు హెల్మెట్లు.. రూట్ మార్చుతున్న దొంగలుముఖాలకు ముసుగులు.. మొన్న మాస్క్‌లు, నేడు హెల్మెట్లు.. రూట్ మార్చుతున్న దొంగలు

మరిది ఫిర్యాదుతో డొంక కదిలింది.. బాగోతం బయటపడిందిగా..!

మరిది ఫిర్యాదుతో డొంక కదిలింది.. బాగోతం బయటపడిందిగా..!

బంధువైన సిల్లీని చంపడమే గాకుండా ఆమె భర్తకు దగ్గరైన జోలీ అతడిని రెండో పెళ్లి చేసుకుంది. అత్తగారి కుటుంబానికి చెందిన ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి మామ టామ్ మీద తీవ్ర వత్తిడి తెచ్చిన జోలీ ఆస్తిని బదలాయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో స్థిరపడ్డ టామ్ చిన్న కుమారుడు మోజో ఆస్తి బదలాయింపును సవాల్ చేస్తూ వరుస మరణాలపై స్పెషల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా.. సైనేడ్ ఉపయోగించి ఆరుగురిని హతమార్చినట్లు ఒప్పుకుంది జోలీ. మొత్తానికి 17 ఏళ్ల తర్వాత వరుస హత్యల చిక్కుముడి వీడటం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

English summary
Kerala woman held Allegedly confessed to giving cyanide to husband and five relatives. Jolly has confessed that she gave cyanide to her then husband Roy Thomas, his parents and three other relatives, including a baby, according to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X