వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతును పెళ్లాడిన కేరళ మహిళా మంత్రి ( వీడియో)

By Pratap
|
Google Oneindia TeluguNews

వేనాడ్ (కేరళ) : కేరళ ప్రభుత్వంలో ఏకైక మహిళామంత్రిగా కొనసాగుతున్న పీకే జయలక్ష్మి రైతును వివాహం చేసుకున్నారు. సీఏ అనిల్‌కుమార్‌ను హిందూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు. కురిచియ సంప్రదాయ పద్ధ్దతిలో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మంత్రి జయలక్ష్మి మెడలో వరుడు అనిల్ కుమార్ మూడుమూళ్లు వేశారు.

ఆ తర్వాత సీఎం ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మనంథవాడీ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన జయలక్ష్మి చాందీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ, యువజన సర్వీసుల మంత్రిగా సేవలందిస్తున్నారు.

 Kerala woman minister marries farmer

ఉత్తర కేరళ జిల్లాలో ఈ వివాహం భారీ కార్యక్రమమైంది. రమేష్ చెన్నితల, కెసి జోసెఫ్, స్పీకర్ ఎన్ శక్తన్‌లతో పాటు పలువురు మంత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు.

వరుడు అనిల్ కుమార్ తెల్లటి చొక్కా, ముండు ధరించి వధువు మెడలో తాళి కట్టారు. ఈ వివాహాన్ని స్థానిక టెలివిజన్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. దాదాపు 30 ఏళ్ల వయస్సు గల జయలక్ష్మి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు.

English summary
The lone woman minister in the Congress-led UDF government in Kerala, PK Jayalakshmi, on Sunday married a farmer in a traditional Hindu tribal ritual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X