• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేవీ సకాలంలో రక్షించడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కేరళ మహిళ

|

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 324 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు సజిత జబిల్. ఇప్పుడు సజిత జబిల్ ఒక్కరి గురించే ఎందుకంటే... ఆమె నిండు గర్భిణీ. అలువాకు సమీపంలో ఉండే చెంగమనడ్ ప్రాంతంలో నివాసముంటోంది.

వరదలతో ఈ ప్రాంతమంతా కొట్టుకుపోయింది. సజిత మాత్రం తన ఇంటిపైకి ఎక్కి ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది. నిండు గర్భణి కావడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. అంతలోనే నేవీ హెలికాఫ్టర్ కనిపించింది. ఆమెలో సగం ప్రాణం తిరిగి వచ్చింది.

Kerala woman rescued by navy delivers baby boy

సజిత పరిస్థితిని తెలుసుకున్న నేవీ అధికారులు ఒక డాక్టరును ఇంటి పైకి దించారు. పరీక్షించిన డాక్టరు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించాల్సిందిగా తెలిపారు. వెంటనే సజిత బెల్టులతో జాగ్రత్తగా కట్టి హెలికాఫ్టర్‌ ఎక్కించారు. కొంచెం రిస్క్ అయినప్పటికీ ఇక వేరే ఛాన్స్ లేకపోవడంతో నేవీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆమెను కొచ్చిలోని సంజీవని హాస్పిటల్‌కు నేరుగా హెలికాఫ్టర్‌లోనే తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన అరగంటకే సజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ చెబుతూ నేవీ వారి ఫోటోలను ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే అలువ అనే ప్రాంతం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం పెరియార్ నది తీరంలో ఉండటంతో అత్యంత భారీ నష్టం ఇక్కడే జరిగింది. ఈ భారీ వరదలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో మెట్రో సర్వీసులను రద్దు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్‌పోర్టును ఈనెల 26 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Kerala woman rescued by navy delivers baby boy

ఇంకా వేలమంది ప్రజలు చెట్లు, ఇంటి పైకప్పులపై ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సహాయ శిబిరాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అయితే సహాయకచర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎర్నాకులం,పతనంతిట్ట జిల్లాలనుంచి 3వేలకు పైగా ప్రజలను సహాయశిబిరాలకు అధికారులు తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The nightmare for a pregnant woman, stuck on the rooftop of her house in flood-hit Kerala, ended when an Indian Navy's chopper reached to rescue her.ajitha Jabil lives in Chengamanad town near Aluva, one of the worst affected areas in the rain battered state. Navy chopper arrived soon after, with a doctor, who was lowered onto the rooftop to examine her. With his go-ahead, Ms Jabil was strapped into a harness and winched up to the chopper and flown to INHS Sanjivani hospital in Kerala's Kochi where she gave birth to baby boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more