• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

|

మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, అకృత్యాలు పెరిగిపోతోన్న ప్రస్తుత తరుణంలో మృగాళ్లకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కేరళలో సంచలనం రేపిన ఈ కేసులో మాత్రం బాలికను రేప్ చేసి, ఆ సెక్స్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడి, ఆమె మరణానికి కారణమైంది ఓ కీచక మహిళేనని పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదంకర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదం

టీనేజర్ సూసైడ్ మిస్టరీ..

టీనేజర్ సూసైడ్ మిస్టరీ..

కేరళలోని త్రిసూర్ జిల్లా కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలిక గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతోన్న ఆమె.. తల్లిదండ్రులు పక్క గదిలో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసుకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, పోస్ట్ మార్టం రిపోర్టులోనూ ఆమెది ఆత్మహత్యేనని తేలడంతో ఏడాది కిందటే అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఏడాది కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసులో పోలీసులకు సంచలన లీడ్ లభించడంతో టీనేజర్ సూసైడ్ మిస్టరీ వీడింది..

అమ్మాయిపై మహిళ అత్యాచారం..

అమ్మాయిపై మహిళ అత్యాచారం..

చనిపోయిన బాలిక ఫోన్ లోని కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులకు.. ఆమె తరచూ ఒక నంబర్ తో ఎక్కువగా మాట్లాడినట్లు తెలిసింది. ఆ వివరాలు బయటికి తీయగా.. సదరు నంబర్ అభిరామి అనే 25 ఏళ్ల మహిళదని వెల్లడైంది. వరందరపల్లికి చెందిన అభిరామి.. చాలా కాలంగా త్రిసూర్ లోనే ఉంటూ టాటూ ఆర్టిస్టుగా జీవనం సాగిస్తోంది. బాలికకు తన క్లాస్ మేట్ ద్వారా అభిరామితో పరిచయం ఏర్పడింది. పరిచయమైన కొద్దిరోజులకే అభిరామిలోని కామోన్మాదం కట్టలుతెంచుకుంది. బాలికను బలవంతపెట్టి అసహజమైన రీతిలో అత్యాచారానికి పాల్పడింది అభిరామి. అంతేకాదు..

లవర్‌కు వీడియోలు పంపుతానంటూ..

లవర్‌కు వీడియోలు పంపుతానంటూ..

ఇంటర్ చదివే బాలిక అప్పటికే ఒక అబ్బాయితో ప్రేమలో ఉండగా, అతణ్ని వదిలేయాలంటూ బాలికపై అభిరామి ఒత్తిడి చేసింది. లవర్ ను వదిలేయకుంటే తామిద్దరి మధ్య జరుగుతోన్న వ్యవహారాన్ని అందరికీ చెప్పేస్తానని, సెక్స్ వీడియోలను బహిర్గతం చేస్తానని అభిరామి బెదిరింపులకు పాల్పడింది. అలా చాలా కాలంపాటు బాలికపై లైంగిక అకృత్యం కొనసాగింది. అభిరామి వేధింపులను, ఆమె బెదిరింపులను తట్టుకోలేక బాధిత బాలిక గతేడాది ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ కాల్ డేటాను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

కీచక మహిళ అభిరామి అరెస్టు..

కీచక మహిళ అభిరామి అరెస్టు..

బాలిక ఆత్మహత్య కేసులో కాల్ డేటాన విశ్లేషించిన పోలీసులు.. సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని నిపుణులతో తెరిపించగా.. అందులో బాలికతో అభిరామి కలిసున్న ఫొటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. అనుమానితురాలిగా అభిరామిని స్టేషన్ ను పిలిచి, పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం బయటపడింది. పోలీసులు సాక్ష్యాలు చూపించటంతో నిందితురాలు నేరం ఒప్పుకుంది. అభిరామిపై ఐపీసీ సెక్షన్ 377 (అసహజమైన సెక్స్), పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, అరెస్టు అనంతరం రిమాండ్ కు తరలించారు.

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

English summary
Police in Kerala’s Thrissur have taken into custody a 24-year-old woman for allegedly blackmailing and sexually exploiting a 16-year-old girl, who had subsequently committed suicide. Police said abetment to suicide charge will also be invoked against the accused. According to the police, the teenage girl, a first-year college student, was found dead at her residence in the city around one year ago. Subsequently, a case of unnatural death was registered and investigations were initiated. Shortly afterwards, the investigators were about to close the case, but suspicious details emerged during the examination of the deceased girl's phone call records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X