వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం చోద్యం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిస్తే ఉద్యోగంలో చేర్చుకోరా..?

|
Google Oneindia TeluguNews

మల్లాపురం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంతో ఓ ప్రభుత్వ స్కూలు టీచరుపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అయితే తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పోలీసులను ఆశ్రయించింది టీచర్.

పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన టీచర్

పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన టీచర్

కేరళలోని కొట్టక్కల్‌‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లయిన నాలుగునెలలకే బిడ్డకు జన్మనివ్వడంతో ఆమెను తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. గర్భంతో ఉన్న మహిళ మేటర్నటీ లీవ్‌పై వెళ్లారు. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి స్కూలులో చేరేందుకు రాగా ఆమెను అనుమతించలేదు పేరెంట్స్ టీచర్ అసోసియేషన్. పైగా ఆమెను అనరాని మాటలు అన్నారు. గత ఐదేళ్లుగా ఆ మహిళ ఆ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది.

కోర్టులో కొనసాగిన విడాకుల ప్రక్రియ

కోర్టులో కొనసాగిన విడాకుల ప్రక్రియ

తన తొలి భర్తతో విడాకులు తీసుకుంది టీచర్. అయితే విడాకులు ఇంకా మంజూరు కాలేదు. విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతోంది. ఆ సమయంలో మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ తొలి భర్తతో విడాకులు మంజూరు కాకపోవడంతో రెండో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈలోగ అంటే 2018లో ఆమె భర్త నుంచి విడాకులు వచ్చింది. కోర్టు నుంచి ఆర్డరు కూడా వచ్చింది. వెంటనే రెండో వ్యక్తిని మహిళా టీచర్ వివాహం చేసుకుంది. రెండో వ్యక్తిని పెళ్లి చేసుకోకముందే గర్భం దాల్చడంతో ఆ తర్వాత పెళ్లి చేసుకున్న నాలుగునెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. 2019లో తన లీవ్ పూర్తికాగానే తిరిగి రీజాయిన్ అయ్యేందుకు రాగా అధికారులు ఆమెను లోనికి రానివ్వలేదని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది.

న్యాయం చేయలాంటూ పోలీసులను ఆశ్రయించిన టీచర్

న్యాయం చేయలాంటూ పోలీసులను ఆశ్రయించిన టీచర్


మహిళ బాలలహక్కుల కమిషన్‌ను కలిసి తన బాధను విన్నవించుకుంది. స్పందించిన బాలల కమిషన్ అధికారులు స్కూలు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అంతేకాదు ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్‌ను ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. ఇక వేసవి సెలవులు ముగియగానే మహిళా టీచర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశించినప్పటికీ... స్కూలు ప్రిన్సిపాల్ మరియు ఇతర పీటీఏ మెంబర్స్ అంగీకరించలేదు. డీడీఈ ఆదేశాలు ఉన్న ఆర్డర్ చూపినప్పటికీ వారు ఒప్పుకోకపోగా తనను అవమానించారని, దూషించారని చెప్పింది మహిళా టీచర్. ఈ క్రమంలోనే వారందరిపై జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అసలు తన వ్యక్తిగత విషయమైన వివాహం, గర్భం వంటి విషయాల గురించి వారెందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో తనకు అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది మహిళా టీచర్.

English summary
A pre primary teacher of a government school in Kottakkal in Kerala has approached police alleging that the school authorities and the PTA members of the school didnot allow her to rejoin duty after maternity leave as she gave birth to a child after she gave birth to a child after just four months of marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X