వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్.. ఏకంగా 22 కోట్ల జాక్‌పాట్..!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్ కొని ఏకంగా 22 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు కేరళకు చెందిన సోప్నా నాయర్. అద‌ృష్టం తలుపు తట్టడమంటే ఇదేనేమో మరి. కేరళకు చెందిన సోప్నా నాయర్ భర్తతో కలిసి దుబాయ్‌లో నివాసముంటున్నారు. అయితే అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రతినెలా బిగ్ టికెట్ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. కేవలం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన ప్రయాణీకులకు మాత్రమే ఆ లాటరీలో పాల్గొనే అవకాశముంటుంది. ఆ క్రమంలో కేరళ నుంచి దుబాయ్ వెళ్లిన సోప్నా నాయర్ ఆ లాటరీకి సంబంధించిన టికెట్ కొనుగోలు చేశారు. అయితే భర్తకు చెబితే ఎందుకు అవన్నీ అంటారని ఆయనకు చెప్పలేదట.

అయితే బుధవారం నాడు తీసిన డ్రా లో సోప్నా నాయర్ కు లాటరీ తగిలింది. 3.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు 22 కోట్ల రూపాయలు. ఇదివరకు నాలుగుసార్లు టికెట్లు కొన్న లాటరీ తగలేదు. ఈసారి అనుకోకుండా లాటరీ తగిలి అంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుందనేసరికి ఆనందంలో మునిగితేలుతున్నారు సోప్నా నాయర్ ఫ్యామిలీ.

Kerala Woman Wins 22 crores In UAE Lottery

10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)

నాలుగుసార్లు తన ప్రయాణంలో టికెట్లు కొన్నప్పటికీ ఎన్నడూ జాక్‌పాట్ తగల్లేదు. కానీ ఈసారి మాత్రం అదృష్టం తలుపుతట్టింది. తన భర్తకు తెలియకుండా పలుమార్లు టికెట్లు కొన్నానని.. ఆయన ఏమంటారోననే భయంతో తనకు చెప్పలేదంటున్నారు సోప్నా నాయర్. నిర్వాహకులు ఫోన్ చేసి ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పినా.. నమ్మలేకపోతున్నామని ఆనంద భాష్పాలు కార్చారు. అయితే ఆ లాటరీ తాలూకు విజేతల పేర్లు బిగ్ టికెట్ వెబ్‌సైట్‌లో పెట్టారు.

Kerala Woman Wins 22 crores In UAE Lottery

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 కోట్ల రూపాయల లాటరీ తగలడంతో సోప్నా నాయర్ కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే అందులో కొంత మొత్తం నిరుపేదల కోసం వెచ్చిస్తానని.. మిగతా కొంత కుటుంబానికి వాడుకుంటానని ఆమె చెబుతున్నారు.

English summary
An Indian woman has won a whopping USD 3.2 million in the monthly raffle draw in the UAE and said that she wants to use a part of the money for underprivileged people, especially women, according to media reports on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X