వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్యూట్ సిస్టర్ : రాంగ్‌రూట్‌లో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు బుద్ధిచెప్పిన ధీరవనిత (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాంగ్‌రూట్‌లో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు బుద్ధిచెప్పిన ధీరవనిత (వీడియో)

మనం తప్పు చేయనప్పుడు అందులో ఉండే కిక్కే వేరు. అవును నిజం.. తప్పు చేస్తే భయపడాలి తప్ప, ఏం చేయనప్పుడు ఎందుకు అదరాలి, బెదరాలి. అచ్చంగా ఈ విధానాన్ని పాటించారు కేరళకు చెందిన ఓ మహిళ. ఏకంగా ఓ బస్సునే ఎదురించి నిలబడింది. ఆమె ధైర్య సాహసాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. ఆ మహిళపై పొగడ్తల వర్షం కురిపిస్తోన్నారు. శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

అడ్డమొచ్చిన బస్సునే ..

కేరళలో ఓ మహిళ తన స్కూటీపై వెళ్తుంది. ఆమె సరైన దారిలోనే వెళ్తున్నారు. అయితే ఎదురుగా బస్సు అడ్డం వచ్చింది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు భయపడతారు. పక్కకు జరుగుతారు. కానీ ఆమె అలా చేయలేదు. ఆ బస్సు డ్రైవర్‌కు తనదైనశైలిలో బుద్ధి చెప్పారు. తాను వెళ్లాల్సిన దారిలో ఉన్నారు. తన వాహనంపై ఉండి.. ఏటు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఆ మహిళ వేసిన ప్రశ్నకు బదులు లేని బస్సు డ్రైవర్.. చేసినతప్పును సరిదిద్దుకున్నాడు.

తప్పని పరిస్థితుల్లో ..

తప్పని పరిస్థితుల్లో ..

ఆమె అలానే నడిరోడ్డుపై తన స్కూటీపై ఉన్నారు. దీంతో తానే తప్పుచేశానని అర్థం చేసుకున్నాడు డ్రైవర్. వెంటనే తన దారిలోకి కష్టమ్మీద బస్సును తిప్పాడు. అయితే ఈ ఘటనను అంతా ఒకరు వీడియో తీశారు. తర్వాత పోస్ట్ చేయడంతో తెగ వైరలైంది. మహిళ చేసిన చర్యను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు తప్పు చేయకుంటే ఎందుకు భయపడతారు అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. రహదారిపై మహిళ ప్రదర్శించిన ధైర్యసాహసాలు మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని మరొకరు ప్రశంసించారు.

సెల్యూట్ వనిత ..

సెల్యూట్ వనిత ..

రహదారిపై మహిళ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని మరొకరు పొగిడారు. తాను రహదారిపై అలా ఉండటంతో బస్సు డ్రైవర్ తన దారిలోకి రావాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తుచేశారు. అంత చిన్న రహదారిలో వచ్చే సమయంలో తన రూట్‌లో రావాలనే జ్ఞానం కూడా డ్రైవర్‌కు లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తుంటే .. మరో యూజర్ మాత్రం విమర్శలు చేశారు. ఇది దక్షిణాదిలో కాబట్టి ఇలా జరిగిందని.. ఉత్తరాదిలో పరిస్థితి ఇలా ఉండబోదన్నారు. అక్కడ పెద్ద వాహనాలదే అధిపత్యం అనే విధంగా కామెంట్ చేశారు.

English summary
viral video shows a woman driver standing on the right side of the road on her scooty, as a bus driver, who was travelling on the wrong side, is forced to take the right lane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X