• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజ్ఞాతవాసిని..అన్నీ రాత్రిపూటే: పుట్టింటికి దగ్గర్లో: ప్రియుడి గదిలో 11 ఏళ్ల రహస్య జీవితం

|

తిరువనంతపురం: పెద్దలకు భయపడి.. ప్రియుడితో కలిసి ఓ చిన్నగదిలో 11 సంవత్సరాల పాటు గడిపిన ఓ మహిళ ఉదంతం ఇది. ప్రేమ వివాహం చేసుకున్నాననే విషయం తెలిస్తే.. ఏం చేస్తారోననే ఆందోళనతో ఓ చిన్న గదిలో బందీగా ఉండిపోయారామె. పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన ఆ మహిళ, తన పుట్టింటిని వదిలి పెట్టి వెళ్లిపోయారు. పుట్టింటికి సమీపంలోనే ఉన్న ప్రేమికుడి ఇంట్లో రహస్య జీవితం గడిపారు. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి గల కారణాలను వివరించారు. ఒక్కడు సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

  TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant

  Petrol Price: మొహమాటాల్లేవ్: అటు కాంగ్రెస్ ధర్నా..ఇటు పెట్రో రేట్లు మళ్లీ పెంపుPetrol Price: మొహమాటాల్లేవ్: అటు కాంగ్రెస్ ధర్నా..ఇటు పెట్రో రేట్లు మళ్లీ పెంపు

   2010 నుంచి అజ్ఞాతంలోకి..

  2010 నుంచి అజ్ఞాతంలోకి..

  ఆ మహిళ పేరు సాజితా. పాలక్కాడ్ జిల్లా నెన్మరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అయిలూర్‌‌కు చెందిన వేళాయుధన్ కుమార్తె. అదే గ్రామానికి చెందిన రెహ్మాన్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది. అతను స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తోన్నాడు. వేర్వేరు కులాలకు చెందడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీనితో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియలేదు. దీనితో అదే గ్రామంలో నివసించాలని నిర్ణయించుకున్నారు. 2010 ఫిబ్రవరి 2వ తేదీన సాజిత.. రెహ్మాన్ ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె అదే ఇంట్లో రెహమాన్ గదిలో నివసించ సాగారు.

  ఇంట్లోనే ఉంటూ..

  ఇంట్లోనే ఉంటూ..

  తమ కుమారుడి గదిలో మరో మహిళ ఉంటోందనే విషయం అతని తల్లిదండ్రులకు కూడా ఇన్నేళ్లుగా తెలియరాలేదంటే వారెంత జాగ్రత్తపడ్డారో అర్థం చేసుకోవచ్చు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ సాజిత తల్లిదండ్రులు నెన్మారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రెహ్మాన్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు గానీ.. అతని ఇంట్లోనే ఆమె ఉంటోందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. రెహ్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురిని పోలీసులు ప్రశ్నించారు. ఆమె జాడ మాత్రం దొరక లేదు.

   తన భోజనం సగం ఆమెకు

  తన భోజనం సగం ఆమెకు

  రెహ్మాన్ రోజూ అన్నం ప్లేట్‌లో పెట్టుకుని, తన గదికి వెళ్లి భోజనం చేసేవాడని, అలా ఎందుకు చేస్తోన్నాడో మొదట్లో తమకు అర్థం కాలేదని అతని తల్లిదండ్రులు చెప్పారు. తన భోజనం సగం సాజితా పెట్టేవాడనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎప్పుడూ తన గదికి లోపలి వైపు నుంచి గొళ్లెం వేసుకుని పడుకునే వాడని పోలీసులు వెల్లడించారు. అందరూ నిద్రపోయాక రాత్రివేళల్లో.. సాజితా తన కాలకృత్యాలను తీర్చుకునే వారని, ఆమె బయటికి వెళ్లడానికి గదికి ఓ కిటికీని కూడా ఏర్పాటు చేయించడాని చెప్పారు. ఎవరూ లేనప్పుడు.. రాత్రివేళ మాత్రమే సాజితా బయటికి వచ్చేవారని అన్నారు.

  English summary
  The people of Ayilur, a village near Palakkad, are in disbelief after hearing the story of a young couple who lived in their midst. In one line, it reads like this: Rahman, 34, hid Sajitha, 28, who had left her parents to live with him, for 10 years.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X