వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. హంతకురాలు ఆత్మహత్యాయత్నం చేసిందని వెంటనే గుర్తించిన జైలు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 14 ఏళ్ల అవదిలో తన కుటుంబానికి చెందిన 6 మందిని జాలీ థామస్ పక్కాప్లాన్ తో హత్యలు చేసిందని పోలీసులు సాక్షాలు, ఆధారాలు సేకరించారు. మొదట సైనెడ్ ఉపయోగించి జాలీ థామస్ ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని పోలీసులు అన్నారు. అయితే ఆరు మందిని హత్య చెయ్యడానికి జాలీ థామస్ సైనెడ్ తో పాటు అనారోగ్యంతో ఉన్న కుక్కలను చంపడానికి ఉపయోగించే విషం ఉపయోగించి వరుస హత్యలు చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భారత్ లో 55% వివాహితులు జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు, సర్వే షాక్, లేడీస్ లింక్, ఒకేసారి!భారత్ లో 55% వివాహితులు జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు, సర్వే షాక్, లేడీస్ లింక్, ఒకేసారి!

కేరళ శ్రీమంతుల ఫ్యామిలీ

కేరళ శ్రీమంతుల ఫ్యామిలీ

కేరళలోని కోజికోడ్ లో శ్రీమంతుడైన టామ్ థామస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వరుస హత్యలకు గురైనారు. టామ్ థామస్ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన జాలీ థామస్ అత్తింటి వారికి చెందిన రూ. వందల కోట్ల విలువైన ఆస్తిని కాజేయాలనే ఆశతో 2002 నుంచి ఇప్పటి వరకు ఆరు మందిని అతి చాకచక్యంగా హత్యలు చేసింది. చివరికి జాలీ థామస్ కేరళ పోలీసులకు చిక్కిపోయింది.

అత్తింటి ఫ్యామిలీలో వరుస హత్యలు

అత్తింటి ఫ్యామిలీలో వరుస హత్యలు

టామ్ థామస్ కుటుంబ సభ్యులకు రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కేరళలోని శ్రీమంతుల్లో టామ్ థామస్ ఒక్కరు. టామ్ థామస్ ఇంటి కోడలిగా జాలీ థామస్ వారి ఇంటిలో అడుగుపెట్టింది. 20002 నుంచి టామ్ థామస్ ఫ్యామిలీలోని ఒక్కొక్కరిని జాలీ థామస్ పక్కాప్లాన్ తో హత్యలు చేస్తూ వచ్చింది.

అత్త నుంచి హత్యలు మొదలు

అత్త నుంచి హత్యలు మొదలు

2002లో టామ్ థామస్ భార్య అణ్ణమ్మ థామస్ నుంచి సీరియల్ హత్యలు మొదలైనాయి. 2002లో ఒక్కసారిగా అణ్ణమ్మ థామస్ ఇంటిలో కుప్పకూలిపోయారు. సహజంగా అణ్ణమ్మ థామస్ మరణించిందని భావించిన కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అణ్ణమ్మ థామస్ మరణించిన ఆరు సంవత్సరాలకు ఆమె భర్త, ఇంటి యజమాని టామ్ థామస్ (66) ఇంటిలో కుప్పకూలి మరణించారు. టామ్ థామస్ గుండెపోటుతో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు భావించారు.

భర్తను హత్య చేసిన జాలీ

భర్తను హత్య చేసిన జాలీ

2011లో జాలీ థామస్ భర్త రాయ్ థామస్ (40) ఇంటిలో కుప్పకూలి తరువాత మరణించాడు. తరువాత 2014లో అణ్ణమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూ మంజడియల్ (67) ఇంటిలో కుప్పకూలి మరణించాడు. 2016లో ఇదే ఫ్యామిలీలో అల్ఫోన్సా(2) అనే చిన్నారి ఇంటిలో కుప్పకూలి మరణించింది. అల్పోన్సా మరణించిన కొన్ని నెలల్లోనే ఆమె తల్లి సిలి (270 కూడా ఇంటిలో కుప్పకూలి మరణించింది. వీరందరి అంత్యక్రియలు ఒకే చోట నిర్వహించారు.

మరో ఇద్దరి హత్యకు కుట్ర !

మరో ఇద్దరి హత్యకు కుట్ర !

ఆస్తి కోసం అత్తింటి కుటుంబ సభ్యులను జాలీ థామస్ వరుస హత్యలు చేసింది. ఇదే ఫ్యామిలీలో మరో ఇద్దరిని హత్య చెయ్యడానికి స్కెచ్ వేసిన సమయంలో 2019లో జాలీ థామస్ పోలీసులకు చిక్కిపోయింది. కుటుంబ సభ్యులను హత్యలు చెయ్యడానికి జాలీ థామస్ ఆమె రెండో భర్త షాజు, బంధువులు మ్యాథ్యూ, ప్రాజికుమార్ ల సహాయం తీసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సైనెడ్ తో హత్యలు చెసిందని !

సైనెడ్ తో హత్యలు చెసిందని !

కుటుంబ సభ్యులను హత్యలు చెయ్యడానికి జాలీ థామస్ సరికొత్త ప్లాన్ వేసిందని పోలీసులు అంటున్నారు. మొదట సైనెడ్ ఉపయోగించి జాలీ థామస్ ఆమె కుటుంబ సభ్యులను వరుస హత్యలు చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టుం నివేదిక వచ్చిన తరువాత హత్యలు చెయ్యడానికి జాలీ థామస్ కుక్కలకు ఉపయోగించే విషంతో వరుస హత్యలు చేసిన అసలు విషయం వెలుగు చూసింది.

కుక్కలకు ఉపయోగించే విషం !

కుక్కలకు ఉపయోగించే విషం !

కుక్కలు తీవ్రఅనారోగ్యానికి గురై తరువాత ఆ జబ్బు నయం కాదు అని నిర్ధారించుకున్న తరువాత వాటిని చంపడానికి ఉపయోగించే విషం (స్లోపాయిజన్), కొద్దిపాటి సైనెడ్ కలిపి కుటుంబ సభ్యుల తీసుకునే ఆహారంలో వేసి జాలీ థామస్ ఆరు హత్యలు చేసిందని వెలుగు చూసిందని ఈ కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి సీమెన్ మీడియాకు చెప్పారు. వరుస హత్యల కేసుల్లో 2019లో జాలీ థామస్ తో పాటు ఆమె రెండో భర్త షాజు, ఈమె సమీప బంధువులు మ్యాథ్యూ, ప్రాజికుమార్ లను అరెస్టు చేసి కోజికోడ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న జాలీ థామస్ గురువారం తన మణికట్టు కత్తిరించుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నామని కోజికోడ్ పోలీసులు, జైలు సిబ్బంది తెలిపారు.

English summary
Kerala's cyanide killer, Jolly Shaju, who is accused of killing 6 members of her family over the years, attempted to commit suicide in jail. Kozhikode Police said Jolly slit her wrist to kill herself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X