వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రికి చుక్కలు చూపించిన ఐపీఎస్‘సింహం’:శబరిమలకు ఆర్ టీసీ బస్సులో, నో వీఐపీ!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో పోలీసు సింహంగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి మరోసారి వార్తల్లో నిలిచారు. సామాన్యులతో పాటు మీకే ఒకే చట్టం అంటూ ఏకంగా కేంద్ర మంత్రి, ఆయన అనుచరులను అడ్డుకుని వారిని ఆర్ టీసీ బస్సుల్లో శబరిమలకు పంపించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎస్ అధికారి తీరుపై బీజేపీ నాయకులు మండిపతున్నారు. అయితే మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఐపీఎస్ అధికారి చట్టప్రకారం విధులు నిర్వహించారని, ఆయన తీరును సమర్థిస్తున్నారు.

పంపా పార్కింగ్

పంపా పార్కింగ్

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, తుపాను కారణంగా నీలక్కల్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని పంపా నది తీరంలోని వాహనాల పర్కింగ్ ప్రాంతం పూర్తిగా దెబ్బతినింది. పంపా నది తీరంలోని ప్రాంతంలో వాహనాల పార్కింగ్ ను పూర్తిగా నిషేదించారు. ప్రైవేటు వాహనాలను అక్కడికి అనుమతించడం లేదు. కేవలం కేరళ అర్ టీసీ బస్సులను మాత్రమే పంపా వరకు అనుతిస్తున్నారు. ఆర్ టీసీ బస్సుల్లో మాత్రమే అయ్యప్ప భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.

శబరిమలకు కేంద్ర మంత్రి

శబరిమలకు కేంద్ర మంత్రి

తమిళనాడుకు చెందిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాదాకృష్ణన్, ఆయన అనుచరులు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడనాకి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. కేంద్ర మంత్రి పోన్ రాదాకృష్ణన్ కేరళలోని నీలక్కల్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర విధులు నిర్వహిస్తున్నారు.

 ప్రత్యేక ఆర్ టీసీ బస్సు

ప్రత్యేక ఆర్ టీసీ బస్సు

నీలక్కల్ ప్రాంతానికి వెళ్లిన కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ ఆయన అనుచరులతో కలిసి ప్రైవేట్ వాహనాల్లో పంపా తీరానికి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర సార్ పంపా తీరంలో ప్రైవేట్ వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషేధించామని, మీరు, మీ అనుచరుల కోసం ప్రత్యేక ఆర్ టీసీ బస్సు ఏర్పాటు చేస్తామని, మీరు అందులోనే వెళ్లాలని శాంతియుతంగా కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ కు మనవి చేశారు.

మేము వీఐపీలు

మేము వీఐపీలు

ఐపీఎస్ యతీష్ చంద్ర ఇచ్చిన సమాధానంపై కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ మండిపోయారు. మేము వీఐపీలు, మా వాహనాలనే అడ్డుకుంటారా, మా వాహనాలకు పార్కింగ్ లేదంటారా, మీరు ఏమనుకుంటున్నారు అంటూ కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ ఆవేశంతో ఊగిపోయారు. సార్ మీ తీరుతో ఇక్కడ అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, మీ వాహనాలు ఇక్కడే పార్కింగ్ చేసి ఆర్ టీసీ బస్సులో వెళ్లాలని ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ కు మనవి చేశారు.

మంత్రి VS ఐపీఎస్

మంత్రి VS ఐపీఎస్

కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ కు, ఐపీఎస్ అధికారి యతీష్ చంద్రకు ఇదే విషయంలో మాటామాటా పెరిగింది. అక్కడ ఉన్న అధికారులు, అయ్యప్ప భక్తులు ఇద్దరికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. తరువాత కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ మాత్రం ప్రైవేట్ వాహనంలో పాంపా తీరానికి వెళ్లడానికి అవకాశం ఇచ్చి ఆయన అనుచరులు మాత్రం ఆర్ టీసీ బస్సులో వెళ్లాలని పోలీసులు చెప్పారు. అయితే కేంద్ర మంత్రి పొన్ రాదాకృష్ణన్ మాత్రం పోలీసుల తీరుపై రగిలిపోయారు. చివరికి కేంద్ర మంత్రి, ఆయన అనుచరులు ఆర్ టీసీ బస్సులో పంపా తీరానికి వెళ్లారు.

 బీజేపీ లీడర్స్ ఫైర్

బీజేపీ లీడర్స్ ఫైర్

ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఒక కేంద్ర మంత్రి పట్ల పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేది అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్ శబరిమలకు వెళ్లిన సమయంలో ఇదే ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర ఆయనకు రాచమర్యాదలు చేసి స్వామి భక్తిని ప్రదర్శించారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

ఐపీఎస్ సూపర్

ఐపీఎస్ సూపర్

2015లో కేరళలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలి జరిగింది. ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలిని వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆ సందర్బంలో ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర రంగంలోకి దిగగి ప్రధాని ర్యాలిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారి మీద లాఠీచార్జ్ జరిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ సందర్బంలో యతీష్ చంద్ర సూపర్ అంటూ బీజేపీ నాయకులు స్వయంగా అభినందించారు. ప్రస్తుతం బీజేపీ నాయకులు మినహా మిగిలిన పార్టీల నాయకులు యతీష్ చంద్రకు మద్దతుగా నిలిచారు. కర్ణాటకలోని దావణగెరె ప్రాంతానికి చెందిన యతీష్ చంద్ర కేరళలో ఐపీఎస్ అధికారిగా పని చేస్తూ పోలీసు సింహం అంటూ సిన్సియర్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

English summary
Karnataka based IPS officer Yatish Chandra who is working in Kerala sends central minister Pon Radhakrishna by bus to Pampa after a heated debate. Pon Radhakrishna wanted to go by his vehicle to Pampa but IPS officer Yatish Chandra did not allowed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X