వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీపై బీజేపీ ఫోకస్ : ఇబ్బంది లేకుండా చూడాలని యోగికి మోడీ లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో జోష్‌ మీదున్న బీజేపీ .. అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈ ఏడాది 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కువ లోక్‌సభ సీట్లున్న యూపీపై నజర్ పెట్టింది బీజేపీ.

యూపీపై ఫోకస్ ..
దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడే లోక్‌సభ సీట్లు కూడా ఎక్కువ. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే చాలు కేంద్రంలో అధికారం చేపట్టొచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఊహించినట్టుగానే 2014, 2019 ఎన్నికల్లో కమలం వికసించింది. అయితే లోక్‌సభ ఎన్నికలే కాదు అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టిసారించింది. వాస్తవానికి యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. రెండేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే సమస్యల పరిష్కారం ఫోకస్ చేస్తే .. ప్రజల నుంచి వ్యతిరేకత అంతగా రాదని ఆ పార్టీ భావిస్తోంది.

key issues to be solve.. modi letter to yogi

పెండింగ్ పనులు ...
ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ మేరకు యోగికి లేఖ రాశారు మోడీ. నీటి ఎద్దటితో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. తొలుత నీటి సమస్యను తీర్చాలని యోగికి స్పష్టంచేశారు. బుందేల్‌ఖండ్, విద్యాంచల్‌లో ఇప్పటికీ నీటి సమస్యతోపాటు మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల వచ్చేలోపు ఆ సమస్యను పరిష్కరించాలని స్పష్టంచేశారు. సీఎం యోగితో‌పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌కు మోడీ లేఖ రాశారు. యూపీపై మరింత దృష్టిసారించాలని లేఖలో కోరారు. బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవిత్ర గంగా ప్రక్షాళనకు వేగంగా పనిచేయాలని గుర్తుచేశారు. గంగా నదిని కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

English summary
BJP winning the Lok Sabha elections, the BJP has focused on the assembly elections. It is learned that there will be 3 state assembly elections this year. The BJP has put focus on the UP with more Lok Sabha seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X