వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు డిప్యూటీల మధ్య నితీశ్ కుమార్.. కీలక శాఖలు వారికే, హోం శాఖ మాత్రం తన వద్ద..

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు శాఖలు కూటా కేటాయించారు. అయితే తక్కువ సీట్లు గెలిచిన జేడీయూ మనసులో ఎక్కడో సందేహాం... వారికే కాదు సగటు మనిషిలో కూడా ప్రశ్న. వీరి భాగస్వామ్యం ఎన్నాళ్లూ కొనసాగుతోంది. సావ్యంగా ఐదేళ్లు సాగుతోందా..? లేదంటే విభేదాలతో బయటకొస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం.. మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ సీఎం సీటు అడగలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నడచుకుంది. అయితే ఇద్దరూ డిప్యూటీలను నియమించింది. తార్‌కిశోర్ ప్రసాద్, రేణు దేవీలను ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చింది. దీంతో అధికార కేంద్రం వారి ఇద్దరి చేతిలో ఉంటోందా అనే సందేహం వస్తోంది. అయితే కీలకమైన హోం శాఖను తన వద్దే నితీశ్ కుమార్ అట్టిపెట్టుకున్నారు. దీంతో అప్పుడే బీజేపీతో కయ్యానికి సిద్దమనే సంకేతాలు పంపారనే విమర్శకులు అంటున్నారు.

key ministries are nitish gives to his deputies..

తార్ కిశోర్‌ ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం పదవీతోపాటు ఆర్థికశాఖ, వాణిజ్య పన్నులు, పర్యావరణ, అటవీ, ఐటీ, విపత్తుల నిర్వహణ, పట్టణాభివృద్ది శాఖలను అప్పగించారు. ఇటు రేణు దేవీ కూడా మరో డిప్యూటీ సీఎం.. ఆమెకు పంచాయతీరాజ్, వెనుకబడిన తరగతులు, ఈబీసీ సంక్షేమం, పరిశ్రమల శాఖలను ఇచ్చారు. వీరిద్దరికీ కీలకమైన శాఖలను అప్పగించడంతో.. అధికారం ఇక్కడే తిరుగుతుందని అర్థమవుతోంది.

పైకి మాత్రం సవ్యంగానే సాగుతోంది. కానీ విభేదాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కానీ చాణక్యుడు నితీశ్ కుమార్ మాత్రం చేజారి పోకుండా చూసుకోగలరని విశ్లేషకులు అంటున్నారు.

English summary
bihar cm nitish kumar gives to his deputies key ministries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X