• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో కీలక ట్విస్ట్ .. స్కార్పియో వాహన యజమాని హత్యకు గురైన హిరెన్ కాదు

|

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ యొక్క దక్షిణ ముంబై ఆంటిలియా ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25 బాంబు బెదిరింపు దర్యాప్తులో మహీంద్రా స్కార్పియో వాహనం కీలకంగా మారింది . ఇది కార్మైచెల్ రోడ్‌లోని అంబానీ ఇంటి ఆంటిలియా నుండి కొన్ని మీటర్ల దూరంలో అనుమానాస్పదంగా పార్క్ చేయబడి అందులో 20 జెలటిన్ స్టిక్స్ , అంబానీ కుటుంబానికి బెదిరింపు హెచ్చరిక తో కూడిన లేఖ ఉండటంతో ఈ వాహనం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అయితే ఈ వాహనం పోలీసులు ఆంటిలియా సంఘటనకు ఎనిమిది రోజుల ముందు దొంగిలించబడిందని యజమానిని విచారించడం ద్వారా నివేదించారు. ఈ కేసు దర్యాప్తు ఇలా ఉండగానే స్కార్పియో వాహనం యజమాని హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది .

ముఖేష్ అంబానీకి సెక్యూరిటీ భయం .. స్కార్పియో యజమాని మర్డర్ , కేసు ఏటీఎస్ కు బదిలీ ముఖేష్ అంబానీకి సెక్యూరిటీ భయం .. స్కార్పియో యజమాని మర్డర్ , కేసు ఏటీఎస్ కు బదిలీ

 స్కార్పియో వాహనం తనది కాదని పోలీసులకు చెప్పిన హిరెన్

స్కార్పియో వాహనం తనది కాదని పోలీసులకు చెప్పిన హిరెన్

స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ ది కాదని , దర్యాప్తు కొనసాగిస్తున్న ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వాహనం ఏప్రిల్ 7 2007న థానే నివాసి అయిన సామ్ పీటర్ న్యూటన్ చేత థానే ఆర్టీవో వద్ద రిజిస్టర్ చేయబడిందని పేర్కొన్నారు . స్కార్పియో వాహన యజమానిగా పోలీసులు విచారించిన మన్సుఖ్ హిరెన్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం ఈ వాహనం తనది కాదని, కాకుంటే తన వద్ద ఉన్న వాహనం దొంగిలించబడిందని చెప్పారు.

నౌపడా పోలీస్ స్టేషన్ లో స్కార్పియో వాహన పంచాయితీ

నౌపడా పోలీస్ స్టేషన్ లో స్కార్పియో వాహన పంచాయితీ


మరణానికి ముందు క్రైమ్ బ్రాంచ్‌కు హిరెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం హిరెన్‌కు థానేలో కార్ డెకార్ వ్యాపారం ఉంది, మరియు కొన్ని ఉపకరణాలతో వాహనాన్ని అమర్చమని థానే కు చెందిన న్యూటన్ కోరాడు . దానికి సంబంధించిన బిల్లు 2.80 లక్షలు కాగా న్యూటన్ తనకు రెండు చెక్కులను ఇచ్చాడని, కాని నేను చెక్కులను జమ చేసినప్పుడు, రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయని, ఆ తర్వాత న్యూటన్ వద్ద నుండి బకాయిలు పొందడానికి తాను ఎంతగానో ప్రయత్నం చేశానని, ఈ ఈ క్రమంలో నౌపడా పోలీస్ స్టేషన్ లో కూడా ఇద్దరి పంచాయితీ జరిగిందని హిరెన్ చెప్పినట్లుగా సమాచారం.

 న్యూటన్ కారు హిరెన్ వద్దకు .. కేసును దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్

న్యూటన్ కారు హిరెన్ వద్దకు .. కేసును దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్

డబ్బులు చెల్లించలేని క్రమంలో, డబ్బులు తిరిగి చెల్లించే వరకు స్కార్పియో వాహనాన్ని వాడుకోమని న్యూటన్ హిరెన్ కు ఇచ్చినట్లుగా హిరెన్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే వాహనం రోడ్డుపై మధ్యలో ఆగిపోవడం దాని పక్కకు పార్క్ చేసిన హిరెన్ తర్వాత రోజు వాహనం కోసం వెళ్లగా వాహనం దొంగతనానికి గురైనట్లుగా పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురయ్యారు.


యాంటిలియా సంఘటన, ఆ తర్వాత జరిగిన హిరెన్ హత్యపై దర్యాప్తు ఇప్పుడు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) హత్య మరియు వాహనం దొంగతనంపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఏఎస్ఐ సచిన్ వాజ్ స్కార్పియో వాహనాన్ని నాలుగు నెలలు వాడుకున్నారన్న హిరెన్ భార్య

ఏఎస్ఐ సచిన్ వాజ్ స్కార్పియో వాహనాన్ని నాలుగు నెలలు వాడుకున్నారన్న హిరెన్ భార్య

తన ప్రకటనలో, హిరెన్ భార్య విమ్లా ఈ వాహనాన్ని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ కు అప్పగించారని, అతను దీనిని 2020 నవంబర్ నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 వరకు నాలుగు నెలలు ఉపయోగించాడని చెప్పాడు. ఇక ఈ కేసు పై న్యూటన్‌ ఈ విషయం దర్యాప్తులో ఉన్నందున తాను మాట్లాడలేనని చెప్పాడు.
వాజ్ ఎప్పుడూ వాహనం తన వద్ద లేదని ఖండించారు. హిరెన్ భార్య ప్రకారం, ఫిబ్రవరి 5 న వాజ్ వాహనాన్ని తిరిగి ఇచ్చిన తరువాత, తమ వద్ద వాహనం 12 రోజుల పాటు ఉందని ఆ తర్వాత చోరీకి గురైందని చెప్పారు .

 బాంబు బెదిరింపు వ్యవహారంలో నంబర్ ప్లేట్ మార్చి ఉండటంతో గుర్తించలేదన్న కుటుంబం

బాంబు బెదిరింపు వ్యవహారంలో నంబర్ ప్లేట్ మార్చి ఉండటంతో గుర్తించలేదన్న కుటుంబం


కారు డాక్టర్ శ్యాం న్యూటన్ కు చెందినదని హిరెన్ పేర్కొన్నట్లు విఖ్రోలి పోలీసులకు చెందిన ఒక అధికారి తెలిపారు. అది దొరికిన సాయంత్రం టివిలో వాహనాన్ని చూశానని, అయితే రిజిస్ట్రేషన్ నంబర్ భిన్నంగా ఉన్నందున దానిని గుర్తించడంలో విఫలమయ్యానని హిరెన్ భార్య విమ్లా పోలీసులకు తెలిపారు .
ఏదేమైనా, కారు గురించి వివరాలు తెలుసుకున్న రెండు వారాల తరువాత, కూడా పోలీసులు కేసును పరిష్కరించలేదు. ఈ కేసులో హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరింత జటిలంగా మారింది. న్యూటన్ పేరు వాహన యజమానిగా బయటకు రావడంతో కేసులో మరింత ఉత్కంఠ నెలకొంది.

English summary
ATS officials investigating Mukesh Ambani's bomb threat case have identified Mansukh Hiren as not the owner of Scorpio vehicle. The vehicle was registered on April 7, 2007 at Thane RTO by Sam Peter Newton, a resident of Thane. Mansukh Hiren, who was questioned by police as the owner of the Scorpio vehicle, told police that the vehicle was not his, But the vehicle he was stolen when he is using the vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X