వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖబడ్దార్.. రెచ్చిపోయిన కేంద్రమంత్రి.. అధికారిపై ఆగ్రహం (వీడియో)

|
Google Oneindia TeluguNews

బీహార్ : కేంద్రమంత్రి అశ్విన్‌కుమార్ చౌబే రెచ్చిపోయారు. వెనుకాముందు చూడకుండా అధికారి పట్ల ఒంటికాలిపై లేచారు. లోక్‌సభ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలనే విచక్షణ లేకుండా ఫైరయ్యారు. దాంతో విధి నిర్వహణలో ఉన్న అధికారి పట్ల కేంద్ర మంత్రి దురుసుగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే గాకుండా ఆఫీసర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.

బీహార్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కేకే ఉపాధ్యాయ.. కేంద్రమంత్రి అశ్విన్‌కుమార్ కాన్వాయ్ ను ఆపారు. పరిమితికి మించి వాహన శ్రేణి ఉండటమే దానికి కారణం. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కాన్వాయ్ లో అత్యధికంగా వాహనాలు ఉండటంతో డ్యూటీలో ఉన్న సదరు అధికారి నిలువరించారు. ఎన్నికల కోడ్ రూల్స్ మంత్రి బ్రేక్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే అశ్విన్‌కుమార్ ఆ అధికారిపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.

Khabardar : Union Minister Tells Bihar Officer Who Stopped His Convoy

<strong>కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?</strong>కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే తన డ్యూటీ తాను చేశానంటున్నారు ఆ అధికారి. మంత్రి కాన్వాయ్ లో 30కి పైగా వాహనాలు ఉండటంతో ఆపాల్సి వచ్చిందన్నారు. ఈసీ రూల్స్ ప్రకారం అన్ని వాహనాలుంటే సీజ్ చేయాల్సి ఉంటుందని వివరించగా.. నువ్వేమీ చేయాలేవంటూ ఆ అధికారిపై ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి. అదలావుంటే అధికారి హెచ్చరికలు పట్టించుకోకుండానే కాన్వాయ్ తో ముందుకెళ్లిపోయారు. అయితే మంత్రి అలా తనను ధిక్కరించి వెళ్లిపోతే చూస్తూ ఊరుకోబోమని.. ప్రతి వాహనంపై కేసు నమోదు చేస్తామన్నారు. రూల్స్ ప్రకారం చర్యలు తప్పవన్నారు.

English summary
A video of Union Minister Ashwini Kumar Choubey threatening a government official after he was stopped for allegedly violating the Model Code of Conduct has surfaced, just a week before the Lok Sabha election. In the video, the minister is seen in a heated argument with Sub-Divisional Magistrate KK Upadhyay when the officer stopped his convoy in Bihar on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X