వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రద పై వివాదాస్పద వ్యాఖ్యలు: నిరూపిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయనన్న అజాంఖాన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆమె లోదుస్తులు అలాంటివే.. జయప్రద‌పై దారుణమైన కామెంట్ ! || Oneindia Telugu

తొలి దశ విడత ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో దశ ఎన్నికల వేడి మరింత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఎప్పటిలాగే సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తన పాత శత్రువు జయప్రదపై పరోక్షంగా పదప్రయోగం చేశారు.

 కాంట్రవర్శీకి కేరాఫ్‌గా అజాంఖాన్

కాంట్రవర్శీకి కేరాఫ్‌గా అజాంఖాన్

అజాం ఖాన్...కాంట్రావర్శీకి కేరాఫ్‌గా నిలిచిన వ్యక్తి. ఒక్కసారి నోరు విప్పాడంటే చాలు... అందులో ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వెతుక్కోవచ్చు. అనేదంతా అనేసి చెప్పేదంతా చెప్పేసి మళ్లీ రుజువు చేయమని తానే చెబుతాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేముందు ఫలానా వ్యక్తిపై విమర్శలు చేస్తున్నట్లుగా తెలియకుండానే ఆ వ్యక్తిని టార్గెట్ చేయడంలో సిద్ధహస్తుడు. తాజాగా రాంపూర్‌లో తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జయప్రదపై పరోక్షంగా పరుషపదజాలం ప్రయోగించారు. ఇదేంటని అడిగితే తాను వ్యాఖ్యలు చేశానని ఒప్పుకుంటున్నాడు కానీ ఫలానా వ్యక్తిపై మాత్రం చేయలేదని తెలివైన సమాధానం ఇస్తున్నారు.

 ఆమె ఆర్ఎస్ఎస్ ఖాకీ అండర్‌వేర్ వేసుకుంటుందని ఎప్పుడో తెలుసు

ఆమె ఆర్ఎస్ఎస్ ఖాకీ అండర్‌వేర్ వేసుకుంటుందని ఎప్పుడో తెలుసు

ఉత్తర్‌ప్రదేశ్‌ నియోజకవర్గం రాంపూర్‌లో ఎన్నికల హీట్ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి బరిలోకి ఈ మధ్యే కమల తీర్థం పుచ్చుకున్న సినీనటి జయప్రద బరిలో ఉన్నారు. ఆమెపై పోటీలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ అజాం ఖాన్. కొద్ది రోజుల క్రితం అజాం ఖాన్ ఓ సభలో మాట్లాడుతూ జయప్రద పేరు తీయకుండానే తన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "మీకు నాకు మధ్య తేడా ఏముంది. ఆమె నిజమైన రంగు ఏమిటో తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు సమయం పట్టింది. ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకుంటుందన్న విషయాన్ని నేను 17రోజుల్లోనే గ్రహించాను. " అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే ఆర్‌ఎస్ఎస్ అనుబంధ పార్టీ బీజేపీలో జయప్రద చేరడాన్ని ఉద్దేశించి అజాం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అజాం ఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు

అజాంఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సర్వత్రా విమర్శలకు దారి తీయడంతో ఆయన తిరిగి వివరణ ఇచ్చారు. అసలు తన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదని చెప్పుకొచ్చారు. తాను ఫలానా వ్యక్తిని అన్నానని రుజువు చేస్తే ఈ ఎన్నికల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటానని అజాం ఖాన్ చెప్పారు. తను ఏమి మాట్లాడుతున్నానో తనకు అవగాహన ఉందని చెప్పిన అజాంఖాన్... తను ఎవరినీ అవమానించలేదని చెప్పుకొచ్చారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే అజాంఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఛైర్మెన్ రేఖా శర్మ పరిశీలించారు. అజాంఖాన్‌కు నోటీసులు పంపుతామని తెలిపారు. ఎన్నికల నుంచి అజాంఖాన్‌ను నిషేధించాలని కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతామని మహిళా కమిషన్ తెలిపింది. ఇక ఖాన్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అజాంఖాన్ దిగిజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. అసలు సమాజ్‌వాదీ పార్టీకి మహిళలంటే గౌరవముందా లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

English summary
A day after Azam Khan’s stoked a controversy with his ‘khaki underwear’ remark, the Samajwadi Party leader Monday clarified that he was not referring to actor and BJP candidate Jaya Prada in his election speech, and that he will not contest polls if proven guilty, reports said. “I haven’t named anyone. I know what I should say. If anyone can prove that I have named anyone anywhere and insulted anyone, then I’ll not contest elections,” he said, accusing media of misinterpreting his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X