• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సహనం కోల్పోయిన సీఎం.. సెల్ఫీ కోసం వెళ్తే... (వీడియో)

|

కర్నాల్ : కాంట్రవర్షియల్ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. సాయం కోసం వస్తే తిట్ల దండకం చదివినా.. ప్రశ్నించిన వారికి వార్నింగ్‌లు ఇచ్చినా అది ఆయనకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉండే ఆయన..తాజాగా దురుసు ప్రవర్తనతో మీడియాలో హైలైట్ అయ్యాడు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన యువకుడి సెల్‌ఫోన్ లాక్కుని పడేసే ప్రయత్నం చేశాడు.

కర్నాల్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఖట్టర్ వేదికపైకి వెళ్తుండగా ఒక యువకుడు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఖట్టర్ ఆ యువకుడి సెల్‌ఫోన్ లాక్కుని విసిరేసే ప్రయత్నం చేశాడు. అది సాధ్యం కాకపోవడంతో ఆ యువకుడిని పక్కకు నెట్టేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Khattar fumes over party worker for trying to take selfie

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వృద్ధ దంపతులు సాయం కోసం సీఎం కార్యాలయానికి వచ్చారు. కొంతమంది తమను మోసం చేసి రూ.19 లక్షలు కాజేశారని ఖట్టర్‌తో చెప్పారు. దీంతో సీఎం వారిని ఇష్టం వచ్చినట్లు దూషించి పంపేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

గతేడాది సైతం ఖట్టర్ జర్నలిస్టుతో ఇలాగే ప్రవర్తించారు. గ్రీవెన్స్ సెల్‌లో సమస్యల పరిష్కారంపై జరుగుతున్న జాప్యంపై ఓ విలేఖరి ప్రశ్నించగా.. సీఎం ఆయనను నోటికొచ్చినట్లు తిట్టారు. ప్రభుత్వంపై వేలెత్తి చూపడం మీడియా పనికాదని క్లాస్ పీకారు. హద్దుల్లో ఉండకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనిపై మీడియాతో పాటు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో క్షమాపణలు చెప్పారు.

కేబినెట్ కమిటీల కొనసాగింపునకు కేంద్రం నిర్ణయం...8 కేబినెట్ కమిటీల్లో సభ్యులు వీరే..!

English summary
Haryana Chief Minister Manohar Lal Khattar on Thursday lost his cool and snubbed a person as he tried to take a selfie with him. In a video that surfaced on media, the Haryana CM can be seen pushing aside the youth who tried to click a selfie with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X