వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ వంటకంగా ‘కిచిడీ’?: నెటిజన్ల రచ్చ, కేంద్రమంత్రి దిగొచ్చారు!

గత కొంత కాలంగా కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కిచిడీని ఇష్టపడే వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, ఇష్టం లేని ఇదే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే వింత వింత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోకేంద్ర ఆహారశాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ స్పందించారు. కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. 'మీరు వండిన కిచిడీ చాలు. వరల్డ్ ఫుడ్ ఇండియాలో కిచిడీకి రికార్డ్ ఎంట్రీ మాత్రమే ఇవ్వబోతున్నాం' అని ఆమె ట్విట్టర్ ఖాతాలో తేల్చి చెప్పారు.

కాగా, కేంద్రమంత్రి ఈ విషయంపై స్పష్టతనివ్వకముందు నెటిజన్లు సోషల్ మీడియాతో కిచిడీపై రచ్చ చేయడం గమనార్హం. 'ఎవరైనా కిచిడీ తింటున్నప్పుడు చూస్తే.. లేచి నిలబడాలా? సినిమాకు ముందు కిచిడీ ఖచ్చితంగా తిని తీరాలా? కిచిడీ నచ్చనివారు దేశద్రోహులేనా?' అని జమ్మూకాశ్మీకర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

'కిచిడీ తినడం వల్ల ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారని.. రాముడు ఒకప్పుడు ప్రతిరోజూ కిచిడీ తినేవారని త్వరలోనే మెసేజ్ పోటెత్తుతాయి' అని ఓ నెటిజన్ సెటైర్లు వేశాడు. మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటిస్తోందని, లేదంటే రాహుల్ ప్రభుత్వం ఉంటే ఏ ఇటలీ వంటకాన్నో? పిజ్జానో ప్రకటించేదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కిచిడీని ప్రకటిస్తే మిగితా వంటకాలు ఏం కావాలని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు కిచిడీ తినని వారిని పాకిస్థాన్ పంపేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

English summary
On Wednesday, India cooked khichdi, literally on Twitter. All of a sudden the humble dish was trending on the micro-blogging site over the report that khichdi will soon be declared as India's "national dish" by the ruling Bharatiya Janata Party (BJP) government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X