• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi 420: ఆంటీలు ముట్టుకుంటే రూ. లక్ష, పట్టుకుంటే రూ. రెండు లక్షలు, రెస్టారెంట్స్, హోటల్స్ లో !

|

చెన్నై/ కోయంబత్తూరు/ మదురై: కరోనా వైరస్ (COVID-19) కాలంలో అమాయకులను దోచుకోవడానికి lockdown కష్టాలు తీర్చుకోవడానికి ఇద్దరు కిలాడీ ఆంటీలు సరికొత్త అవతారం ఎత్తారు, టిప్పుటాప్ గా రెఢీ కావడం, వెనుక నలుగురిని వెంట వేసుకుని లగ్జరీ కారులో వెళ్లి అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఒక ఆంటీ ముట్టుకుంటే రూ. లక్ష, మరో ఆంటీ పట్టుకుంటే అక్షరాల రెండు లక్షాలు ఇవ్వాల్సిందే అని వెలుగు చూసింది. ఇద్దరు ఆంటీల ఆటలు అరికట్టడానికి పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. కరోనా కలాలంలో సరికొత్త స్కెచ్ లతో దోచుకుంటున్న ఈ ముఠా గ్యాంగ్ తో ఓ నగరంలోని వ్యాపారులు ఉలిక్కిపడ్డారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 కరోనా కాలంలో ప్రజలు

కరోనా కాలంలో ప్రజలు

దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి తాండవం చేస్తోంది. ఇంతకాలం శుభ్రత, పరిశుభ్రత పాటించని వాళ్లు కూడా ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కడ మా ప్రాణం తీస్తుందో ? అనే భయంతో అన్నీపాటిస్తున్నారు. ప్రతిరోజు శానిటైజర్లు, సబ్బులతో చేతులు శుభ్రం చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ ఎన్నడూ లేని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 నిన్న స్టేటస్ కోసం.... నేడు ప్రాణాల కోసం

నిన్న స్టేటస్ కోసం.... నేడు ప్రాణాల కోసం

నిన్నటి వరకు హోటల్, రెస్టారెంట్స్ లో బిర్యానీలు తిన్నా, భోజనం చేసినా ప్రిస్టేజ్ గా భావించే ప్రజలు నేడు కరోనా వైరస్ భయంతో బయట ఆహారం తీసుకోవాలన్నా, చిరుతిండ్లు తినాలన్నా హడలిపోతున్నారు. రెస్టారెంట్లు, హోటల్స్ శుభ్రంగా పెట్టుకుని కస్టమర్లను ఆకర్షించడానికి వాటి యజమానులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హటల్స్ లో ఆహారం తినే ప్రజలు మాత్రం కరోనా భయంతో వెనుకా ముందు ఆలోచిస్తున్నారు.

 ఇద్దరు ఆంటీల హల్ చల్

ఇద్దరు ఆంటీల హల్ చల్

తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు ఆంటీల తీరుతో రెస్టారెంట్స్, హోటల్స్ యజమానులు హడలిపోతున్నారు. కోయంబత్తూరులోని పులియంకులం ప్రాంతంలో రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. పులియంకులం ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో రిజిస్టర్ అయిన ఓ ఖరీదైన కారులో ఇద్దరు మహిళలు, వారి వెంట నలుగురు వ్యక్తులు వెళ్లారు. హోటల్స్ దగ్గర కారు నిలిపిన ఆ గ్యాంగ్ ఒక్కసారిగా ఓ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

 ఫుడ్ ఇన్స్ పెక్టర్స్

ఫుడ్ ఇన్స్ పెక్టర్స్

మేడమ్ లు ఇద్దరూ ఫుడ్ ఇన్స్ పెక్టర్స్. మీ హోటల్స్, రెస్టారెంట్స్, కిరాణా షాపులు పరిశీలించడానికి వచ్చారు అంటూ ఇద్దరు మహిళలు వెంట వెళ్లిన వ్యక్తులు నానా హంగామా చేశారు. అంతే హోటల్స్ లో వంట గదుల్లోకి వెళ్లిన ఇద్దరు మహిళలు ఏంటీ, మీరు శుభ్రత లేకుండా వంటలు చేస్తున్నారు ? ఇవే ప్రజలకు వడ్డించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా ? అంటూ రెచ్చిపోయారు. ఇక లాభం లేదు వెంటనే మీ హోటల్స్, రెస్టారెంట్టస్ సీజ్ చెయ్యాల్సిందే అంటూ టిప్పుటాప్ లో వెళ్లిన ఇద్దరు మహిళలు నానా రచ్చ చేశారు.

 ఆంటీలు ముట్టుకుంటే రూ. లక్ష, పట్టుకుంటే రూ. 2 లక్షలు

ఆంటీలు ముట్టుకుంటే రూ. లక్ష, పట్టుకుంటే రూ. 2 లక్షలు

ఒక మహిళ కోయంబత్తూరులో ఎంతో పేరు ఉన్న విఘ్నేష్ అనే ఫేమస్ హోటల్ యజమానిని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని, లేదంటే మీ హోటల్ సీజ్ చేస్తామని బెదిరించింది. మరో మహిళ ఓ రెస్టారెంట్ యజమానిని బెదిరించి అక్కడ ఉన్న వంటకాలు శుభ్రంగా లేవని పట్టుకుని చూసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించింది. ఇలా ఇద్దరు ఆంటీలు, వారి గ్యాంగ్ చిక్కినకాడికి లూటీలు చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్ టార్గెట్ పూర్తి అయిన తరువాత ఈ గ్యాంగ్ పెద్దపెద్ద కిరాణా షాపుల మీద పడి తూకాలు సక్రమంగా లేవని, నాణ్యమైన సరులు లేవని వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేశారు.

  ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu
   నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్స్

  నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్స్

  కోయంబత్తూరులో ఆంటీల దెబ్బకు హడలిపోయిన వ్యాపారులు కోయంబత్తూరు జిల్లా ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరా తియ్యగా వచ్చిన ఆంటీలు అసలైన ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కాదని వెలుగు చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చిక్కినకాటికి చిక్కినట్లు లూటీ చేసిన నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కోయంబత్తూరు నుంచి మాయం అమ్మారు. కిలాడీ లేడీలతో పాటు ఆహార భద్రత శాఖ నకిలీ అధికారులను పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు.

  English summary
  Khiladi 420: Tamil Nadu Fake food Dept officers threaten Coimbatore hotels asking money.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X