చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi company: సత్యా స్కెచ్, అమాయక మహిళలు టార్గెట్. రూ. లక్షకు, పంగనామాలు, వీఐపీలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వేలూరు/ రాణిపేట్: పేరు సత్యా, అయితే సత్యభామ కంటే కొవ్వు ఎక్కువే. ఈ సత్యా స్కెచ్ కు ఎంతో మంది అమాయక మహిళలు లబోదిబో అంటున్నారు. అనేక మంది మహిళలకు సత్య మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు, లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేసి వారికి పంగనామాలు పెట్టి మాయం అయ్యింది. రోజు బ్యూటీపార్లల్ కు వెళ్లి సింగారించుకున్ని సత్యా తాను ఫైనాన్షియర్ అంటూ అనేక మందిని నిలువునా ముంచేసింది. రెండు సంవత్సరాల నుంచి పోలీసులకు, లెక్కలేనంత మంది మహిళలకు హల్వా తినిపించి తప్పించుకుని తిరుగుతున్న సత్యా చివరికి అడ్డంగా చిక్కిపోయింది.

Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్

 రాణిపేట కిలాడీ సత్యా

రాణిపేట కిలాడీ సత్యా

తమిళనాడులోని రాణిపేట్ లో సత్యా అనే మహిళ నివాసం ఉంటున్నది. శ్రీకృష్ణుడి సత్యభామకు ఎంత గర్వం ఉందో అంతకంటే ఈ సత్యాకు గర్వంతో పాటు అంతకంటే ఎక్కువ కొవ్వు ఉంది. ప్రతినిత్యం బ్యూటీ పార్లర్ కు వెళ్లి టిప్పుటాప్ గా అలంకరించుకుని ఊరిమీద పడుతోంది. ఇలా బ్యూటీపార్లర్లు, కూరగాయల మార్కెట్ లు, ఫ్యాన్సీ స్టోర్లు ఇలా చాలా ప్రాంతాల్లో మద్యతరగతి, శ్రీమంతుల కుటంబాలకు చెందిన మహిళలను కిలాడీ సత్యా పరిచయం చేసుకుంది.

 నేను పెద్ద ఫైనాన్షియర్

నేను పెద్ద ఫైనాన్షియర్

మంచి మంచి డ్రెస్ లు, చీరలు కట్టుకుని మహిళలను పరిచయం చేసుకుంటున్న సత్యా తాను పెద్ద ఫైనాన్షియర్ అని అమాయకులైన మహిళలను నమ్మించింది. తాను ఓ కంపెనీలో నగదు డిపాజిట్ చేశానని, తనకు నెలకు వడ్డీ మాత్రమే లక్షరూపాయలు వస్తోందని సత్యా వారికి చెప్పింది. సత్యా పెట్టుడి ఆమె మాటలే. మంచి మాటకారి కావడంతో చాలా మంది మహిళలు సత్యా వలలో పడిపోయారు.

 బ్యాంకులో మీకు బొక్క.....రూ. 1 లక్షకు వారానికి రూ. 5 వేలు వడ్డి

బ్యాంకులో మీకు బొక్క.....రూ. 1 లక్షకు వారానికి రూ. 5 వేలు వడ్డి

మీరు బ్యాంకులో సుమారు లక్షరుపాయలు డిపాజిట్ చేశారంటే మీకు నెలకు రూ. 600 నుంచి రూ. 700 మాత్రమే వస్తోంది. నేను డబ్బు డిపాజిట్ చేస్తున్న కంపెనీలో లక్ష రూపాయలకు వారిని రూ. 5 వేలు వడ్డీ వస్తోందని, రెండు వేల రూపాయలు కంపెనీ తీసుకుని మీకు రూ. 3 వేలు తనకు ఇస్తోందని మహిళలను సత్యా నమ్మించింది. ఇలా నెలకు రూ. 1 లక్షకు రూ. 12 వేలుకు పైగా వడ్డీ వస్తోందని సత్యా అమాయకులైన మహిళలకు మాయమాటలు చెప్పింది.

 సత్యా స్కెచ్ అదిరిపోయింది

సత్యా స్కెచ్ అదిరిపోయింది

సత్యా మాయమాటలు నమ్మిన అనేక మంది అమాయక మహిళలు వారి ఇళ్లో ఉన్న బంగారు నగలు తీసుకెళ్లి ఆమె చెప్పిన కంపెనీలో ఇచ్చారు. బంగారం ఇచ్చిన వారికి 10 రోజుల్లో రూ. 3 వేలు చొప్పున ఇచ్చింది. మొదట లక్ష డిపాజిట్ చేసిన మహిళలకు వారిని రూ. 3 చొప్పున ఇచ్చింది. ఇలా మూడు నాలుగు నెలల పాటు మహిళలకు క్రమం తప్పకుండా సత్యా చెప్పిన కంపెనీ వడ్డీ చెళ్లించింది.

 ఏడుకొండలవాడా గోవిందా గోవింద

ఏడుకొండలవాడా గోవిందా గోవింద

వడ్డీ కరెక్టుగా రావడంతో ఒక్కొ మహిళ వారి ఇళ్ల పత్రాలు కుదవ పెట్టి మరీ రూ. 5 నుంచి రూ. 10 లక్షలు ఆ కంపెనీలో డిపాజిట్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఆ కంపెనీ నిర్వహకులు జెండా ఎంతేయడంతో అమాయక మహిళలు ఏడుకొండలవాడా గోవిందా గోవింద అన్నారు. కొంతకాలం సత్యా కోసం గాలించిన బాధితులు చివరికి ఆమె ఆచూకి లేకపోవడంతో రాణిపేట్ పోలీసులను ఆశ్రయించారు.

 హల్వా తినిపించిన సత్యభామ

హల్వా తినిపించిన సత్యభామ

కేసు నమోదు చేసిన పోలీసులు సత్యా కోసం గాలించారు. అయితే మోసపోయిన మహిళలకు సత్యా ఇంటి అడ్రస్ కూడా సక్రమంగా తెలీకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి కిలాడీ సత్యా అమాయకులైన మహిళలకు, పోలీసులకు హల్వా తినిపిస్తూ తప్పించుకుని తిరిగింది. అయితే సత్యా టైమ్ బాగాలేకపోవడం, గ్రహాలు అనుకూలించకపోవడంతో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది. అమాయకులైన మహిళల దగ్గర సత్యా కొన్ని కోట్ల రూపాయల వసూలు చేసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 సత్యా గ్యాంగ్ లో వీఐపీలు, పొలిటీషియన్స్ ?

సత్యా గ్యాంగ్ లో వీఐపీలు, పొలిటీషియన్స్ ?

సత్యా వెనుక కొందరు వీఐపీలు, రాజకీయ నాయకులు ఉన్నారని అనుమానం ఉందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని రాణిపేట్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద సత్యా అరెస్టు కావడంతో ఆమె బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కిలాడీ లేడీని విచారణ చేస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Khiladi lady: Woman arrested in Cheating case by Ranipet Police in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X