చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

khiladi lady: లైన్ లోకి వచ్చిన అక్కా, చెల్లి, రూ. 36 లక్షలు ఇచ్చేసిన తిక్కలోడు, ఐశ్వర్య జీన్స్ సినిమా !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ చిత్తూరు/శివగంగై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయం అయిన మహిళతో అతను పిచ్చపాటిగా చాటింగ్ చేస్తున్నాడు. రోజూ గంటలు గంటలు మాట్లాడుతున్న ఆమె అతనికి మస్కా కొట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అప్పుడప్పుడు రూ. 16 లక్షలు ఇప్పించుకుంది. తరువాత తన చెల్లిని నీకు పరిచయం చేస్తానని చెప్పింది. అనుకున్నట్లు లైన్ లోకి మరో యువతి రావడంతో అతను సంతోషంలో మునిగిపోయాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన చెల్లెలు అతని దగ్గర ఇప్పటి వరకు రూ. 20 లక్షలు వసూలు చేసింది. అక్కాచెల్లి లైన్ లోకి వచ్చారని తిక్కలోడు ఏకంగా రూ. 36 లక్షలు వారి బ్యాంకు అకౌంట్లకు బదిలి చేశాడు. చివరికి రోజూ మాట్లాడుతున్న ఇద్దరు అమ్మాయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియాలో అతని అకౌంట్లు బ్లాక్ చెయ్యడంతో బిత్తరపోయి సిటీ పోలీసు కమీషనర్ ను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే ఐదు షాకింగ్ విషయాలు బయటకు రావడంతో అందరూ హడలిపోయారు.

Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య, అవసరానికి డబ్బులు, ఫ్రీగా బెడ్, క్లైమాక్స్ లోIllegal affair: డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య, అవసరానికి డబ్బులు, ఫ్రీగా బెడ్, క్లైమాక్స్ లో

 ప్రభుత్వ ఉద్యోగం.... పెళ్లి చేసుకోవాలని ఉబలాటం

ప్రభుత్వ ఉద్యోగం.... పెళ్లి చేసుకోవాలని ఉబలాటం

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కలైయూర్ కోవిల్ తాలుకాలోని మూలక్కరై గ్రామంలో బారతీరాజా (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమిళనాడు స్పెషల్ పోలీసు ఫోర్స్ లో భారతీరాజా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం భారతీరాజా తిరువొత్తియూర్ లో విధుల్లో ఉన్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని భారతీరాజా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

 ఫేస్ బుక్ లో టచ్ లోకి వచ్చిన ఐశ్వర్య

ఫేస్ బుక్ లో టచ్ లోకి వచ్చిన ఐశ్వర్య

మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న భారతీరాజా ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. చెన్నైలోని అవడిలో నివాసం ఉంటున్న ఐశ్వర్య (26) అనే మహిళ ఫేస్ బుక్ లో భారతీరాజాకు పరిచయం అయ్యింది. ఐశ్వర్యతో పరిచయం పెంచుకున్న భారతీరాజా ఆమెతో పిచ్చపాటిగా చాటింగ్ చేస్తున్నాడు.

 డాక్టర్ చదువుతున్నాను..... నిన్నే పెళ్లి చేసుకుంటా

డాక్టర్ చదువుతున్నాను..... నిన్నే పెళ్లి చేసుకుంటా

నేను డాక్టర్ (ఎంబీబీఎస్) చదువుతున్నానని ఐశ్వర్య ఫేస్ బుక్ ఫ్రెండ్ భారతీరాజాకు చెప్పింది. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని భారతీరాజా చెప్పడంతో తనకు చదువు పూర్తి అయిన తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య అతనికి మాయమాటలు చెప్పింది. డాక్టర్ తనకు భార్య అవుతుందని భారతీరాజా మురిసిపోయాడు. అంతే అప్పటి నుంచి ఇద్దరూ గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు.

 రూ. 16 లక్షలు తీసుకున్న ఐశ్వర్య

రూ. 16 లక్షలు తీసుకున్న ఐశ్వర్య

తాను చదువుకోవడానికి, బంగారు నగలు కొనుగోలు చెయ్యడానికి కొంచెం డబ్బు అవసరం ఉందని ఐశ్వర్య తిక్కలోడు భారతీరాజాకు చెప్పింది. రోజూ గంటలు గంటలు మాట్లాడుతున్న ఐశర్య ఫేస్ బుక్ ఫ్రెండ్ భారతీరాజాకు మస్కా కొట్టింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఐశ్వర్య మొదట రూ. 4 లక్షలతో మొదలు పెట్టి తరువాత అతని నుంచి 6 నెలల నుంచి రూ. 16 లక్షలు ఇప్పించుకుంది. భారతీరాజా రూ. 16 లక్షలు ఐశ్వర్య తండ్రి పళని బ్యాంక్ అకౌంట్ కు బదిలి చేశాడు.

 సీన్ లోకి వచ్చిన చెల్లెలు

సీన్ లోకి వచ్చిన చెల్లెలు

కొంతకాలం క్రితం ఐశ్వర్య తనకంటే తన చెల్లెలు ఇకా బాగుంటుందని, ఆమెను నువ్వు పెళ్లి చేసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మనం మాత్రం కలిసే ఉంటామని తిక్కలోడు భారతీరాజాకు ఫేస్ బుక్ కిలాడీ ఐశ్వర్య చెప్పింది. తరువాత తన చెల్లిని నీకు పరిచయం చేస్తానని ఐశ్వర్య చెప్పింది. అనుకున్నట్లు లైన్ లోకి మరో యువతి రావడంతో భారతీరాజా సంతోషంలో మునిగిపోచి గాల్లో తేలిపోయాడు.

 చెల్లెలికి రూ. 20 లక్షలు ఇచ్చేశాడు

చెల్లెలికి రూ. 20 లక్షలు ఇచ్చేశాడు

ఐశ్వర్య చెల్లెలు అని ఫేస్ బుక్ లో పరిచం పెంచుకున్న యువతి భారతీరాజాను పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దింపింది. ఫేస్ బుక్ లో ఐశ్వర్యకంటే ఆమె చెల్లెలు అందంగా ఉందని అనుకున్న భారతీరాజా ఆమె వలలో పడిపోయాడు. అంతే అప్పటి నుంచి భారతీరాజా ఫేస్ బుక్ లో ఐశ్వర్య, ఆమె చెల్లిలితో చాటింగ్ చేస్తూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. తరువాత ఐశ్వర్య చెల్లెలు కూడా భారతీరాజాకు మాయమాటలు చెప్పి విడతల వారిగా అతని నుంచి రూ. 20 లక్షలు వసూలు చేసింది.

 తిక్కలోడు రూ. 30 లక్షలు ఇచ్చేశాడు

తిక్కలోడు రూ. 30 లక్షలు ఇచ్చేశాడు

చాలాకాలం భారతీరాజాతో ఐశ్వర్య, ఆమె చెల్లి చాటింగ్ చేస్తూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడారు. అక్కాచెల్లి లైన్ లోకి వచ్చారని తిక్కలోడు భారతీరాజా ఏకంగా రూ. 36 లక్షలు వారి బ్యాంకు అకౌంట్లకు బదిలి చేశాడు. చివరికి రోజూ మాట్లాడుతున్న ఇద్దరు అమ్మాయిలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియాలో తన అకౌంట్లు బ్లాక్ చెయ్యడంతో భారతీరాజా బిత్తరపోయాడు.

 ఐశ్వర్య ఫ్యామిలీని పట్టుకున్న పోలీసులు

ఐశ్వర్య ఫ్యామిలీని పట్టుకున్న పోలీసులు

నేను మోసపోయానని అనుకున్న భారతీరాజా చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. చెన్నై సిటీ పోలీసు కమీషనర్ ఆదేశాలతో అవడి పోలీసులు రంగంలోకి దిగి ఐశ్వర్య, ఆమె కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు, అక్కడ పోలీసులతో పాటు భారతీరాజా మైండ్ బ్లాక్ అయ్యే ఐదు విషయాలు వెలుగు చూశాయి. మొదటిసారి ఐశ్వర్యను భారతీరాజా పోలీస్ స్టేషన్ లో డైరెక్టుగా చూశాడు. ఇంతకాలం ముఖం చూడకుండానే తిక్కలోడు లక్షలు లక్షలు ఐశ్వర్యకు ఇచ్చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

 ఐశ్వర్యకు భర్త, ఓ కూతురు, గర్బవతి.....మైండ్ బ్లాక్

ఐశ్వర్యకు భర్త, ఓ కూతురు, గర్బవతి.....మైండ్ బ్లాక్

ఐశ్వర్యకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, ఆమె భర్త శరవణకుమార్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడని, ఆమెకు 8 ఏళ్ల కూతురు ఉందని, ప్రస్తుతం ఐశ్వర్య ఐదు నెలల గర్బవతి అని వెలుగు చూసింది. రెండో షాక్ ఏమిటంటే ఐశ్వర్య ఎంబీబీఎస్ చదవడం లేదని, ఆమె ఇంటర్ లో చదువు మానేసి పెళ్లి చేసుకుందని వెలుగు చూసింది.

 చెల్లెలు కాదు..... సోదరుడు

చెల్లెలు కాదు..... సోదరుడు

ఐశ్వర్యకు చెల్లెలు లేదని, ఆమె సోదరుడు మహేంద్రన్ ను సోషల్ మీడియాలో భారతీరాజాకు చెల్లెలిగా పరిచం చేసిందని మూడో షాక్ తెలిసింది. ఐశ్వర్యనే ఇంతకాలం భారతీరాజాతో గొంతు మార్చి రెండు ఫోన్ నెంబర్లు ఉపయోగించి భారతీరాజాతో మాట్లాడిందని నాలుగో షాక్ తెలిసింది. భారతీరాజా దగ్గర వసూలు చేసిన డబ్బుతో ఐశ్వర్య, ఆమె సోదరుడు మహేంద్రన్ ఇంతకాలం విలాసవంతమైన జీవితం గడిపారని ఐదు షాక్ తెలీయడంతో పోలీసులతో పాటు తిక్కలోడు భారతీరాజా మైండ్ బ్లాక్ య్యింది. ప్రభుత్వ ఉద్యోగి భారతీరాజాకు కుచ్చుటోపి పెట్టిన ఐశ్వర్యతోపాటు ఆమె సోదరుడు మహేంద్రన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Khiladi lady: 27 year old Young woman cheating money and arrested near Chennai City in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X