• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi lady: నాకు కోరికలు ఉండవా ?, అక్క ఆనందం కోసం చంపేశా, రివాల్వర్ ఎవరిదంటే, ఇది స్టోరీ !

|

చెన్నై/ ముంబాయి/ పూణే: కట్టుకున్న భర్తను, అత్తమామలను అతి దారుణంగా హత్య చేసిన కోడలు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెబుతోంది. తాను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త నా మట వినలేదు. భార్యను సుఖపెట్టలేని తెలివితేటలు లేని భర్తకు చెప్పిచెప్పి నేను విసిగిపోయాను. తన అత్త తనను టార్చర్ పెట్టింది. నా జీవితానికి ఒకదారి చూపించకుండా చులకన చేశారు. నేను వయసులో ఉన్నాను, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, నాకు ఏమీ కోరికలు ఉండవా ? అంటే తన భర్త, అత్తమామలు నీచంగా మాట్లాడారు .అందుకే సహనం కోల్పోయి ఆ ముగ్గురిని చంపేయాలని తాము డిసైడ్ అయ్యామని కిలాడి కోడలు జయమాల చెప్పింది. తన అక్క ఆనందం కోసం ముగ్గురిని చంపేశామని ఆమె సోదరుడు కైలాష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కోటీశ్వరులైన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఒకే సారి హత్యకు గురైన కేసులో పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

facebook aunty: నాపేరు అనసూయ, అమ్మాయి ఫోటో, డోర్ తీస్తే నాటుకోడి ఆంటీ, రూ. లక్షలు గోవిందా!

కోటీశ్వరుడి ఇంటి కోడలు

కోటీశ్వరుడి ఇంటి కోడలు

రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై సిటీ చేరుకున్నారు. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో దలీల్ చంద్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ కుమార్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. సీతల్ కు మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల (36) అనే మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సీతల్, జయమాల దంపతులకు 13 ఏళ్లు, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆరు మంది ఒకే అపార్ట్ మెంట్ లో

ఆరు మంది ఒకే అపార్ట్ మెంట్ లో

దలీల్ చంద్, ఆయన భార్య పుష్పాబాయ్, కొడుకు సీతల్ కుమార్, కోడలు జయమాల, వారి ఇద్దరు కుమార్తెలు కలిసి నివాసం ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త సీతల్ తన కోరికలు తీర్చడానికి సరిపోడని డిసైడ్ అయిన జయమాల తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని పూణే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. తన భర్త సీతల్ తో విడాకులు తీసుకోవాలని జయమాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పూణేలోని పుట్టింటిలో ఉండిపోయింది. తాను తన పిల్లలు బతకడానికి రూ. 7 కోట్లు భరణం ఇవ్వాలని జయమాల కోర్టును ఆశ్రయించింది. సీతల్, జయమాల దంపతుల విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది.

అక్క ఆనందం కోసం కైలాష్ ఎంట్రీ

అక్క ఆనందం కోసం కైలాష్ ఎంట్రీ

కోడలు జయమాలకు విడాకులు ఇచ్చినా తాము రూ. 7 కోట్లు ఇవ్వలమని దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ జయమాల కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పారు. రెండు నెలల క్రితం జయమాల, ఆమె తమ్ముడు కైలాష్, జయమాలతో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడు, అతని గ్యాంగ్ చెన్నై వెళ్లి మర్యాదగా మాకు ఆస్తిలో భాగం పెట్టాలని, లేదంటే మిమ్మల్ని లేపేస్తామని బెదిరించారు. అప్పట్లో దలీల్ చంద్, అతని కుమారుడు సీతల్ చెన్నైలోని ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చెయ్యడంతో కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైయ్యింది. అప్పటి నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది.

సీసీటీవీ కెమెరాలు రికార్డు

సీసీటీవీ కెమెరాలు రికార్డు

ఈనెల 12వ తేది గురువారం రాత్రి దలీల్ చంద్, ఆయన భార్య పుష్పాబాయ్, వీరి కొడుకు సీతల్ కుమార్ వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దారుణ హత్యకు గురైనారు. దలీల్ చంద్ కుమార్తె పింక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైయ్యింది. దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు.

జయమాల, కైలాష్ అండ్ కో

జయమాల, కైలాష్ అండ్ కో

విమానంలో పూణే వెళ్లిన చెన్నై పోలీసులు జయమాల ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చెన్నై సిటీ పోలీసులు పూణే వచ్చారని తెలుసుకున్న జయమాల, మరో ముగ్గురు నిందితులు కారులో సోలాపూర్ కు పారిపోవడానికి ప్రయత్నించారు. సోలాపూర్ మార్గంలో వెంటాడిన చెన్నై పోలీసులు చివరికి శనివారం వేకువ జామున జయమాల, ఆమె సోదరుడు కైలాష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అందర్నీ చెన్నై తీసుకు వచ్చిన పోలీసులు విచారణ చెయ్యగా షాకింగ్ విషయాలు వెలుగు చేశాయి.

అక్క జీవితం ముఖ్యం

అక్క జీవితం ముఖ్యం

తాను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త నా మట వినలేదు. భార్యను సుఖపెట్టలేని తెలివితేటలు లేని భర్తకు చెప్పిచెప్పి నేను విసిగిపోయాను. తన అత్త తనను టార్చర్ పెట్టిందని జయమాల పోలీసులకు చెప్పింది. నా జీవితానికి ఒకదారి చూపించకుండా చులకన చేశారు. నేను వయసులో ఉన్నాను, 13, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, నాకు ఏమీ కోరికలు ఉండవా అంటే తన భర్త, అత్తమామలు నీచంగా మాట్లాడారు .అందుకే సహనం కోల్పోయి ఆ ముగ్గురిని చంపేయాలని తాము డిసైడ్ అయ్యామని కిలాడి కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్ పోలీసుల విచారణలో అంగీకరించారు. తన అక్క జీవితం నాశనం చేశారని కోపంలో తానే ముగ్గురిని కాల్చి చంపానని కైలాష్ విచారణలో అంగీకరించాడని, జయమలాను కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారని పోలీసు అధికారులు తెలిపారు.

  ఓవైసీ vs బిపిన్ రావత్: పెహ్లూఖాన్‌ను చంపిన వారిని ఎవరు మారుస్తారు..?
  రిటైడ్ మిలటరీ అధికారి రివాల్వర్

  రిటైడ్ మిలటరీ అధికారి రివాల్వర్

  దలీల్ చంద్, ఆమె భార్య పుష్పాబాయ్, వారి కుమారుడు సీతల్ కుమార్ ను హత్య చెయ్యడానికి రెండు రివాల్వర్ లు ఉపయోగించారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ రెండు రివాల్వర్ లు తమిళనాడు రాష్ట్రం బయట నుంచి చెన్నై తీసుకు వచ్చారని పోలీసులు అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ రిటైడ్ మిలటరీ అధికారికి చెందిన రివాల్వర్ ఈ మూడు హత్యలకు ఉపయోగించారని చెన్నై పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రిటైడ్ మిలటరీ అధికారిని విచారణ చెయ్యడానికి చెన్నై సిటీ పోలీసులు సిద్దం అయ్యారు.

  English summary
  Khiladi lady: Chennai murder case, Main accused Jayamala brother Kailash gives statement about the murder.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X