• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi: మొగ్గురు మొగుళ్లు+ మాజీ మంత్రితో ?, సైలెంట్ స్కెచ్, లక్షల్లో లాగేసింది, పోలీసు భర్తకు !

|
Google Oneindia TeluguNews

కరూర్/చెన్నై: కత్తి లాంటి యువతి ఒకరికి తెలీకుండా ఒకరిని ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకుంది. మాజీ మంత్రి ఒకరు ఈ కిలాడీతో సన్నిహితంగా ఉంటూ ఆమెతో ఏకాతంగా కాలం గడిపేశాడని తెలిసింది. కిలాడీ లేడి పెళ్లి చేసుకున్న ముగ్గురిలో ఒక పోలీసు ఉన్నాడు. మాజీ మంత్రితో సన్నిహితంగా ఉంటున్న కిలాడీ లేడీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో కిలాడీ లేడితో జల్సా చేస్తున్న నాయకుడు మంత్రి పదవిలో ఉండటంతో ఈమె ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. వయ్యారాల కిలాడి ముగ్గురు భర్తలు, మాజీ మంత్రితో పాటు మరికొందరితో రొమాన్స్ చేసింది. బాధితులతో పాటు ఆమె ఇద్దరు మొగుళ్లు వరుసగా పోలీసులను ఆశ్రయించడంతో మూడో భర్తతో కులుకుతున్న కిలాడీ లేడీ అడ్డంగా బుక్కైపోయింది.

Illegal affair: 8వ అంతస్తు బాల్కనీలో భార్య, సైలెంట్ గా తోసి చంపేసిన భర్త, చెల్లెలు అని !Illegal affair: 8వ అంతస్తు బాల్కనీలో భార్య, సైలెంట్ గా తోసి చంపేసిన భర్త, చెల్లెలు అని !

సెల్ఫీ ఫోటోలతో వల

సెల్ఫీ ఫోటోలతో వల

తమిళనాడులోని కరూర్ కు చెందిన సౌమ్య చూడటానికి అందంగానే ఉంటోంది. మంచి వయసులో ఉన్న సౌమ్య ఆమె అందచందాలతో వలవేసి కొందరిని వలలో వేసుకుని ఎంజాయ్ చేసింది. వయ్యారంగం, సింగారంగా అలంకరించుకుని పలు ప్రాంతాల్లో ఫోజులు ఇచ్చి సెల్ఫీలు తీసుకుంది. మంచి మంచి ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అమాయకులను వలలో వేసుకోవడం మొదలుపెట్టింది.

రెండుసార్లు ఇద్దరితో లవ్ మ్యారేజ్

రెండుసార్లు ఇద్దరితో లవ్ మ్యారేజ్

సోషల్ మీడియాలో సౌమ్య ఫోటోలు చూసి కరూర్ కు చెందిన వ్యాపారి సురేష్ ఆమె వలలో పడిపోయాడు. సురేష్ ను వివాహం చేసుకున్న సౌమ్య అతనితో కాపురం చేసింది. మొదటి భర్త సురేష్ తో కాపురం చేస్తున్న సమయంలోనే మణిముత్తూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ పోలీసు ఉద్యోగం చేస్తున్న సతీష్ అనే వ్యక్తిని వలలో వేసుకున్న సౌమ్య అతనిని ప్రేమ వివాహం చేసుకుంది.

మాజీ మంత్రితో మేడమ్ కు లింక్

మాజీ మంత్రితో మేడమ్ కు లింక్

తమిళనాడులో గతంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకుడు, అప్పట్లో మంత్రిగా పని చేసిన వ్యక్తితో సౌమ్య రాసుకుని పూసుకుని తిరిగిందని సమాచారం. అన్నాడీఎంకే మంత్రి, సౌమ్య సీక్రెట్ గా జల్సా చేస్తున్నారని చాలా మందికి తెలుసని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్న సౌమ్యకు అప్పట్లో అన్నాడీఎంకే పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, ప్రముఖులతో పరిచయాలు పెరిగిపోయాయి.

బంధువుకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడి

బంధువుకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడి

అప్పటి తమిళనాడు మంత్రితో సౌమ్యకు మంచి సంబంధాలు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలని చాలా మంది సౌమ్యను సంప్రధించారు. సౌమ్యకు సమీప బంధువైన కరూర్ నివాసి విజయ్ కూడా ఆమెకు లక్షల రూపాయలు, 15 పౌండ్ల బంగారు నగలు ఇచ్చి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆమెకు మనవి చేసి ఆమె వెంట తిరిగాడు.

రెండో భర్త బ్యాంకు అకౌంట్లో డబ్బలు..... కిలాడి ఎస్కేప్

రెండో భర్త బ్యాంకు అకౌంట్లో డబ్బలు..... కిలాడి ఎస్కేప్

విజయ్ తో పాటు అతని స్నేహితుల దగ్గర రూ. లక్షల రూపాయలు వసూలు చేసుకున్న సౌమ్య వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది. సౌమ్య ఒక్కసారిగా ఎవ్వరికి కనపడకుండా మాయం అయిపోయింది. సౌమ్యకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మోసపోయామని గుర్తించిన విజయ్ అతని స్నేహితులు ఆమె రెండో భర్త సతీష్ ను కలిశారు. రెండో భర్త సతీష్ బ్యాంకు అకౌంట్ లు ఇచ్చిన సౌమ్య బాధితుల నుంచి అదే బ్యాంకు అకౌంట్ కు డబ్బులు టాన్స్ ఫర్ చేయించుకుంది.

 లేడి మీద కేసులు పెట్టిన భర్తలు, బాధితులు

లేడి మీద కేసులు పెట్టిన భర్తలు, బాధితులు

తనతో చాలా కాలం క్రితమే సౌమ్య విడిపోయి ఆమె వేరుగా జీవిస్తోందని రెండో భర్త సతీష్ బాధితులకు చెప్పాడు. తరువాత విజయ్ అతని స్నేహితులు సౌమ్య మొదటి భర్త సురేష్ దగ్గరకు వెళ్లారు. సురేష్ కూడా తనతో ఆమె విడిపోయిందని చెప్పడంతో విజయ్ తదితరులు షాక్ అయ్యారు. సౌమ్య కోసం గాలించి విసిగిపోయిన విజయ్ అతని స్నేహితులు కరూర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో సౌమ్య మీద ఆమె భర్తలు సురేష్, సతీష్ వేర్వేరుగా రామనాథపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ముచ్చటగా మూడో మొగుడితో ?

ముచ్చటగా మూడో మొగుడితో ?


మొదటి మొగుడు సురేష్, రెండో భర్త సతీష్ కు హ్యాండ్ ఇచ్చిన సౌమ్య శ్రీనివాసన్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని సేలంలో కాపురం పెట్టింది. కరూర్ పోలీసులు తమిళనాడు మొత్తం సౌమ్య కోసం గాలించారు. సౌమ్య ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. చివరికి గత ఏడాది జులైలో సేలంలో సౌమ్యా పోలీసులకు పట్టుబడింది.

 అందంతో పాటు మాటకారి

అందంతో పాటు మాటకారి


తమిళనాడు మాజీ మంత్రితో చనువుగా ఉంటూ అందరిని పరిచయం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని సౌమ్య అనేక మందిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సౌమ్య డీలింగ్స్ విచారణలో వెలుగు చూస్తున్నాయని పోలీసులు చెప్పారు. అనేక చోట్ల సౌమ్య ఎంజాయ్ చేసే ముసుగులో వారి ఇళ్లలోకి వెళ్లి బంగారు నగలు, నగదు లూటీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. జైలుకు వెళ్లిన సౌమ్యా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు హాజరౌతోంది.

English summary
Year Ender 2021: Khiladi lady, Woman arrested in Cheating case near Karur in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X