• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !

|

చెన్నై/ తేని/ మదురై: ప్రేమికులు కొంతకాలంగా ఎంజాయ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో తప్పా ప్రేమికుల మద్య ఏరోజూ పెద్దగా గొడవలు జరగలేదు. అయితే ఓ విషయంలో ప్రియుడి మీద ప్రియురాలు సీరియస్ అయ్యింది. ప్రియుడిని పిలిచి పద్దతి మార్చుకోవాలని ఓ సారి చెప్పింది. ప్రియురాలి అక్క అంతకు ముందే లవ్ లో పడింది. అక్క ప్రియుడు కేటుగాడు. ప్రియుడు చెప్పినమాట వినడం లేదని అక్క లవర్ తో కలిసి ప్రియురాలు విజయశాంతి భలే స్కెచ్ వేసింది. మాట్లాడాలని ప్రియుడిని పిలిపించిన విజయశాంతి అక్క లవర్, బంధువుతో కలిసి దారుణమైన పని చేసింది. తీరా పోలీసులకు చిక్కిపోయిన ప్రియురాలు ఈ స్కెచ్ వేసింది మా అక్క అని బాంబు పేల్చింది.

Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!

 విజయశాంతి లవ్ స్టోరీ

విజయశాంతి లవ్ స్టోరీ

తమిళనాడులోని దిండుగల్ జిల్లా వీరువీదు గ్రామానికి చెందిన ఆనంద్ రాజ్ (29), తేనీ జిల్లా మేళ్మంగళం ప్రాంతానికి చెందిన విజయశాంతి (24) అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఆనంద్ రాజ్, విజయశాంతి చాలా కాలం నుంచి అందరి ప్రేమికులు లాగా కలిసిమెలసి తిరుగుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు.

 ప్రియుడి దారుణ హత్య

ప్రియుడి దారుణ హత్య

జనవరి 21వ తేదీన తేనీ జిల్లా మెళ్మంగళం- వైగైపుత్తూర్ రహదారిలోని ఓ నిర్జనప్రదేశంలో యువకుడు దారుణ హత్యకు గురైనాడని పోలీసులకు సమాచారం అందింది. యువకుడిని అతని కిరాతకంగా ఎక్కడంటే అక్కడ పొడిచి హత్య చేసి తరువాత అతని శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రెండు మూడు రోజుల తరువాత పోలీసులకు సమాచారం అందింది.

 ఈ జిల్లాలో ఏంపని ?

ఈ జిల్లాలో ఏంపని ?

హత్యకు గురైయ్యింది ఆనంద్ రాజ్ అనే యువకుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇంటి నుంచి వెళ్లిన 15 రోజుల తరువాత ఆనంద్ రాజ్ హత్యకు గురైనాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దిండుగల్ జిల్లాకు చెందిన ఆనంద్ రాజ్ తేనీ జిల్లాకు ఎందుకు వచ్చాడు ?, అతనికి వైగైపుత్తూర్ సమీపంలో ఏం పని ? అంటూ పోలీసులు ఆరా తీశారు.

మేడమ్ చివరి ఫోన్ కాల్స్

మేడమ్ చివరి ఫోన్ కాల్స్

తేనీ పోలీసుల విచారణలో ఆనంద్ రాజ్, విజయశాంతి ప్రేమపురాణం బయటకు వచ్చింది. ఇదే సమయంలో ఆనంద్ రాజ్ చివరిసారిగా విజయశాంతికి ఫోన్లు చేశాడని పోలీసులు గుర్తించారు. విజయశాంతి ఇంటికి వెళ్లి పోలీసులు షాక్ అయ్యారు. వారం రోజుల నుంచి విజయశాంతి ఇంట్లో లేదని తెలుసుకున్న పోలీసులకు మరింత అనుమానం ఎక్కువ అయ్యింది.

 విజయశాంతి ఏం చెప్పింది ?

విజయశాంతి ఏం చెప్పింది ?

పోలీసులు మూడు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి విజయశాంతి కోసం గాలించారు. చివరికి బంధువు ప్రభాకరన్ తో కలిసి పారిపోతున్న విజయశాంతి తేనీ జిల్లా సమీపంలో పోలీసులకు చిక్కింది. పోలీసుల విచారణలో విజయశాంతి ఆనంద్ రాజ్ ను తామే హత్య చేశామని అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 డబ్బు ఆశతో వేరే పెళ్లి.... నిశ్చితార్థం

డబ్బు ఆశతో వేరే పెళ్లి.... నిశ్చితార్థం

ఆనంద్ రాజ్ తనతో ఇంతకాలం ఎంజాయ్ చేశాడని విజయశాంతి పోలీసులకు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి ఇంతకాలం తనతో ఎంజాయ్ చేశాడని, డబ్బు ఆశతో వేరే అమ్మాయితో ఆనంద్ రాజ్ ఆమెను నిశ్చితార్థం చేసుకోవాలని ప్రయత్నించాడని, తాను ఎంత నచ్చచెప్పినా నా మాట వినకుండా వేరే పెళ్లికి సిద్దం కావడంతో అతన్ని చంపాలని కొన్ని రోజుల క్రితం డిసైడ్ అయ్యానని విజయశాంతి పోలీసులకు చెప్పింది.

 కిలాడీ సిస్టర్స్.... క్రిమినల్ కేటుగాడి స్కెచ్

కిలాడీ సిస్టర్స్.... క్రిమినల్ కేటుగాడి స్కెచ్

ఆనంద్ రాజ్ ను చంపేయాలని తన అక్క దివ్యా స్కెచ్ వేసిందని, అక్క ప్రియుడు సెల్వా, బంధువు ప్రభాకరన్ తో కలిసి తాను ఆనంద్ రాజ్ ను చంపేశానని విజయశాంతి పోలీసుల విచారణలో అంగీకరించింది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని కోపంతో ఆనంద్ రాజ్ ను వీళ్లు చంపేశారని పోలీసులు అన్నారు. ఆనంద్ రాజ్ ను హత్య చేసిన కిలాడీ సిస్టర్స్ విద్యా, ఆమె ప్రియుడు సెల్వా, విజయశాంతి, వీరి బంధువు ప్రభాకరన్ ను తేనీ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Khiladi Sisters: Youth murder and four arrested near Theni in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X