చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: అర్దరాత్రి భార్య స్కెచ్ వేస్తే ఆ కిక్కే వేరప్ప, జల్సా రాయుడి మటన్ మసాల, ఖరీదైన కారులో ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: దేశంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరగుతున్నాయి. గతంలో బంగారం, వెండి, డబ్బు, విలువైన పట్టుచీరలు ఇలా ఖరీదైన వస్తులు చోరీ చేసేవాళ్లు. ఉల్లిపాయలు అధిక ధర ఉన్న సమయంలో మనోళ్లు వాటిని కూడా వదల్లేదు. ఇప్పుడు దొంగల కన్ను మేకలు, గొర్రెల మీద పడింది. మేకలు, గొర్రెలు చోరీ చెయ్యడానికి ఖరీదైన కారు ఉపయోగించారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కారుతో పాటు భార్యను రంగంలోకి దింపిన కిలాడీ కేటుగాడు దర్జాగా మేకలు, గొర్రెలను చోరీ చేయించి మటన్ మసాలా స్కెచ్ తో జల్సాలు చేశాడు. అర్దరాత్రి భార్య స్కెచ్ వేస్తే ఆ కిక్కే వేరప్ప అంటూ ఇంతకాలం కేటుగాడు రెచ్చిపోయాడు.

Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !

 ఖరీదైన మేకలు పెంపకం

ఖరీదైన మేకలు పెంపకం

చెన్నై శివార్లలోని ఎన్నోర్ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు మంచి హై బ్రీడ్ జాతికి చెందిన మేకలు, గొర్రెలు, పొటేళ్లు పెంచిపోషించి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. చెన్నైలో ఖరీదైన మేకలు, గొర్రెల మాంసాం తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. చెన్నైలో ఎక్కువ శాతం ఎన్నోర్ ప్రాంతంలోని మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తుంటారు.

 మాయం అవుతున్న మేకలు

మాయం అవుతున్న మేకలు

ఎన్నోర్ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు మేకలు, గొర్రెలు పెంచుతూ వాటిని విక్రయిస్తున్నారు. ఎన్నోర్ ప్రాంతంలో చాలా మంది ప్రజలు వీరి జీవనోపాదిగా గొర్రెలు, మేకల పెంపకం అయ్యింది. అయితే కొంతకాలంగా ఎన్నోర్ ప్రాంతంలో గొర్రెలు, బన్నూర్ పొటేళ్లు, మేకలు మాయం కావడంతో స్థానికులు హడలిపోయారు.

 ఏదో జరుగుతోంది ?, ఎలా జరుగుతోందో

ఏదో జరుగుతోంది ?, ఎలా జరుగుతోందో

స్థానిక ప్రజలకు గొర్రెలు, మేకలు మేపే కూలీలపైన మొదట అనుమానం వచ్చింది. అయితే రానురాను మేకలు మేపే కూలీలు వాటిని చోరీ చేసి విక్రయించడం లేదని, ఏదో జరుగుతోంది ? అది ఏమిటో తెలుసుకోవాలని చాలా కాలం ప్రయత్నించారు. దొంగలను పట్టుకోవడం వీలుకాకపోవడంతో చివరికి స్థానికులు ఎన్నోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు,

 ఖరీదైన కారు ఎంట్రీ

ఖరీదైన కారు ఎంట్రీ

రంగంలోకి దిగిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో అర్దరాత్రి పూట ఆ ప్రాంతంలోకి ఖరీదైన కారు రావడం, అందులో నుంచి ఓ మహిళ, మరో వ్యక్తి కిందకు దిగడం, చప్పుడు కాకుండా మేకలు, గొర్రెలను అదే కారులో వేసుకుని వెళ్లిపోవడం పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు.

 లక్ష్మీ బాంబ్ దెబ్బతో హడల్

లక్ష్మీ బాంబ్ దెబ్బతో హడల్

మేకలు చోరీ చేస్తున్న కారు చెన్నైలోని తిరుమలిసాయ్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ అనే వ్యక్తిది అని పోలీసులు గుర్తించారు. అష్రప్ లక్ష్మీ (38) అనే మహిళను మతాంతర వివాహం చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కారులో వచ్చి దర్జాగా మేకలు, గొర్రెలు చోరీ చేసిన మహిళ లక్ష్మీ, ఆమె సోదరుడు అని గుర్తించిన పోలీసులు బిత్తరపోయారు.

Recommended Video

Yash Heads To Maldives With Family | Oneindia Telugu
 రూ. లక్షలకు అమ్మేసి జల్సాలు

రూ. లక్షలకు అమ్మేసి జల్సాలు

లక్ష్మీ ఆమె సోదరుడు ఖరీదైన కారులో వచ్చి ఇప్పటి వరకు 20కి పైగా లక్షల రూపాయల విలువైన మేకలు, గొర్రెలు చోరీ చేసి వాటిని చెన్నైలో విక్రయించారని గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మొగుడు, పెళ్లాం చోరీ చేసిన మేకలు విక్రయించి జల్సాలు చేస్తున్నారని పోలీసులు అన్నారు. భార్య లక్ష్మీని అరెస్టు చేశారని తెలుసుకున్న అష్రఫ్ మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎన్నోర్ పోలీసులు తెలిపారు.

English summary
Khiladi: Young woman arrested by Chennai Police, due to Goat theft near Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X