Khiladi: మెడికల్ షాపుకు లైసెన్స్, పక్కలో క్లీనిక్, వివాహిత మహిళకు చికిత్స చేస్తానని, ఏం చేశాడంటే !
చెన్నై/ధర్మపురి: ఎలాంటి వ్యాపారాలు చేసినా నష్టాలు వస్తాయని, నష్టం లేని వ్యాపారం చెయ్యాలని ఓ యువకుడు ఆలోచించాడు. ఎవరైనా సరే ఎప్పుడో అప్పుడు అనారోగ్యానికి గురౌతరని, వాళ్లు ఆసుపత్రికి, మెడికల్ షాపుకు కచ్చితంగా వస్తారని ఆ యువకుడు పసిగట్టాడు. అంతే మెడికల్ షాపుకు లైసెన్స్ తీసుకున్న ఆ యువకుడు పెద్ద ఇంట్లో మెడికల్ షాపుతో పాటు క్లీనిక్ లాగా పెట్టాడు. ఎవరైనా అనారోగ్యానికి గురై మందుల కోసం మెడికల్ షాపుకు వస్తే మీకు ఇలాంటి జబ్బు ఉందని, అలాంటి జబ్బు ఉందని వాళ్లను భయపెడుతున్నాడు. మెడికల్ షాపు పక్కలోనే ఉన్న క్లీనిక్ లాంటి రూమ్ లో మెడికల్ షాపు పెట్టుకున్న యువకుడే చికిత్స చేసి ఇంతకాలం అమాయకుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నాడు. చుట్టుపక్కల ఎక్కువగా గ్రామాలు ఉండటం, ఆసుపత్రులు దూరంగా ఉండటంతో ఆ యువకుడు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. అనారోగ్యంతో ఉన్న వయసులో ఉన్న మహిళకు చికిత్స చేసే ముసుగులో క్లీనిక్ రూమ్ లో కామాంధుడు రెచ్చిపోయాడు. లోదుస్తుల్లో చేతులు పెట్టిన ఆ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే ఆ మహిళకు ఎక్కడో మండిపోయి క్లీనిక్ లో నుంచి పరుగు తీసి భర్తకు విషయం చెప్పింది, భర్త, పోలీసుల ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో నకిలి డాక్టర్ యవ్యారం మొత్తం బయటకు వచ్చింది.
Girlfriend:
అక్క
మొగుడితో
మరదలు,
ఫస్ట్
ఎస్కేప్,
ఎంజాయ్,
కట్
చేస్తే
కిడ్నాప్,
లేడీ
రివర్స్
తో!

బిజినెస్ మైండ్
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కరిమంగళం సమీపంలోని అనుమంతపురంలో షణ్ముగం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎలాంటి వ్యాపారాలు చేసినా నష్టాలు వస్తాయని, నష్టం లేని వ్యాపారం చెయ్యాలని షణ్ముగం ఆలోచించాడు. ఎవరైనా సరే ఎప్పుడో అప్పుడు అనారోగ్యానికి గురౌతరని, వాళ్లు ఆసుపత్రికి, మెడికల్ షాపుకు కచ్చితంగా వస్తారని షణ్ముగం పసిగట్టాడు.

మెడికల్ షాపుకు మాత్రమే లైసెన్స్
కరిమంగళం మాత్రమే మెడికల్ షాపులు ఉన్నాయని, అనుమంతపురంలో ఇంత వరకు ఎవ్వరూ మెడికల్ షాపు పెట్టలేదని షణ్ముగం గమనించాడు. మెడికల్ షాపుకు లైసెన్స్ తీసుకున్న షణ్ముగం పెద్ద ఇంట్లో మెడికల్ షాపుతో పాటు క్లీనిక్ లాగా పెట్టాడు. ఎవరైనా అనారోగ్యానికి గురై మందుల కోసం మెడికల్ షాపుకు వస్తే మీకు ఇలాంటి జబ్బు ఉందని, అలాంటి జబ్బు ఉందని వాళ్లను షణ్ముగం భయపెడుతున్నాడు.

భారీ మొత్తంలో డబ్బు సంపాధిస్తున్నాడు
మెడికల్ షాపు పక్కలోనే ఉన్న క్లీనిక్ లాంటి రూమ్ లో మెడికల్ షాపు పెట్టుకున్న షణ్ముగం అతనే చికిత్స చేసి ఇంతకాలం అమాయకుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నాడు. చుట్టుపక్కల ఎక్కువగా గ్రామాలు ఉండటం, ఆసుపత్రులు దూరంగా ఉండటంతో షణ్ముగం ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

మందుల కోసం వెళ్లిన వివాహిత మహిళతో ?
పొన్నంపట్టి ప్రాంతంలో మదన్ కుమార్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మదన్ కుమార్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆమె మందులు తీసుకోవడానికి షణ్ముగం మందుల షాపు దగ్గరకు వెళ్లింది. మదన్ కుమార్ భార్యకు చికిత్స చేసే ముసుగులో క్లీనిక్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన కామాంధుడు షణ్ముగం రెచ్చిపోయాడు.

నకిలి డాక్టర్ మైండ్ బ్లాక్
చికిత్స చేసే ముసుగులో వివాహిత మహిళ లోదుస్తుల్లో చేతులు పెట్టిన షణ్ముగం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే ఆ మహిళకు ఎక్కడో మండిపోయి క్లీనిక్ లో నుంచి పరుగు తీసి ఆమె భర్త మదన్ కుమార్ కు విషయం చెప్పింది, మదన్ కుమార్, అతని భార్య ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మదన్ కుమార్ కనీసం ఆర్ ఎంపీ డాక్టర్ కూడా కాదని, మందుల షాపు పెట్టుకుని అమాయకులకు వైద్యం చేసి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని విచారణలో వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించామని ధర్మపురి జిల్లా పోలీసులు తెలిపారు.