వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిన శివసేన: కులకర్ణి ముఖానికి సిరా పూశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్జీద్ కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పూర్తి భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన హామీ వట్టిదే అయింది. ఈ పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం జరుగుతుంది.

ఈలోగానే సోమవారం ఉదయం శివసేన కార్యకర్తలు మాజీ దౌత్యవేత్త, రచయిత సుదీంధ్ర కులకర్ణ ముఖానికి సిరా పూసి అవమానించారు. శివసేన కార్యకర్తలు తన ముఖానికి నల్లరంగు పూశారని కులకర్ణి ఆరోపించారు. ఈ సంఘటన కులకర్ణి నివాసం వెలుపల జరిగింది.

Khurshid Kasuri's book launch: Black paint smeared on Sudheendra Kulkarni's face

నైదర్ ఏ హాక్, నార్ ఎ డోన్ - యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అనే పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వొర్లిలోని నెహ్రూ సెంటర్‌లో జరగనుంది. కులకర్ణి ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేయనున్నారు.

కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమ నిర్వహణను రద్దు చేయాలని అంతకు ముందు శివసేన నెహ్రూ ప్లానిటోరియానికి చెందినవారిని హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అందువల్ల కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోతే విచ్ఛిన్నం చేస్తామని శివసేన హెచ్చరించింది.

English summary
Despite Maharashtra chief minister Devendra Fadnavis' assurance of "total security" for the book launch of Pakistan's former foreign minister Khurshid Kasuri in Mumbai on Monday, the Shiv Sainiks allegedly managed to hackle former top diplomat Sudheendra Kulkarni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X