వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్‌నకు గురైన ఐబి అధికారి, వ్యాపారి హత్య

|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్: గత సెప్టెంబర్‌లో కిడ్నాప్‌కు గురైన ఐబీ అధికారి, వ్యాపారి హత్యకు గురయ్యారు. దాదాపు నెల తర్వాత వారి మృతదేహాలను మేఘాలయలోని సౌత్‌గారో హిల్స్‌ ప్రాంతంలోని అడవిలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

గత సెప్టెంబర్‌ 24న ఐబీ అధికారి వికాశ్‌ సింగ్‌, వస్త్ర వ్యాపారి కమల్‌ సాహాను ఏఎస్‌ఏకే దళానికి చెందిన మిలిటెంట్లు కిడ్నాప్‌ చేశారు. ఆదివారం వారి మృతదేహాలను పోలీసులు సమీపంలోని అడవిలో గుర్తించారు.

కిడ్నాప్‌ చేసిన మరుసటి రోజే వీరిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్‌ఏకే దళ కమాండర్‌ సెంగ్‌బత్‌ షీరా సోదరుడు సెగ్రమ్‌ షీరాను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో మిలిటెంట్లు ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Kidnapped Intelligence Bureau Officer, Merchant's Bodies Found in Meghalaya

మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వరి దేవీపై దాడి జరిగింది. ఫిరోజాబాద్‌లో పని చేస్తున్న భువనేశ్వరి దేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు ఆగ్రాకు చేరుకుంది. అయితే ఆస్పత్రి వద్ద దేవీ కారు పార్కింగ్ విషయంలో ఓ షాప్‌కీపర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

అంతటితో ఆగకుండా దేవీపై షాప్‌కీపర్‌తో పాటు పలువురు దాడి చేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధిత సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవీపై దాడి చేసిన వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

English summary
The body of an Intelligence Bureau officer and a cloth merchant, kidnapped by tribal Garo militants exactly one month back, were recovered from a village in Meghalaya's South Garo Hills district on Saturday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X