వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నీ రాకెట్‌ ముఠాను పట్టించిన భార్యభర్తల గొడవ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు అయింది. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకితీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు ఢిల్లీలోని ఇంద్రప్రస్త అపోలో ఆసుపత్రి సిబ్బంది కాగా, ఒక మధ్యవర్తి, మరో ముగ్గురు కిడ్నీ దాతలు ఉన్నారు.

ముగ్గురు కిడ్నీ దాతల్లో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. ఈ కిడ్నీ ముఠా ఇప్పటి వరకు రాజధాని ఢిల్లీలో నాలుగు కిడ్నీలను అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే ఈ కిడ్నీ ముఠాను పట్టించిందని పోలీసులు తెలిపారు.

kidney

భార్య అనుమతి లేకుండా ఓ భర్త ఆమె కిడ్నీని అమ్మాడు. అయితే డబ్బు విషయంలో వీరిద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలోనే గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఈ కిడ్నీ వ్యాపారం వెలుగు చూసింది. దీంతో కిడ్నీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అపోలో ఆసుపత్రిపై గురువారం రాత్రి దాడులు చేశారు.

ఈ దాడుల్లో కిడ్నీ ముఠా నాలుగు కిడ్నీలు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఈ కిడ్నీ మాఫియా టార్గెట్ చేసి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులైన ప్రజలకు డబ్బు ఆశ చూపించి ఇలా చేస్తున్నారు.

ఈ కిడ్నీ ముఠా కేసులో అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ మూత్ర పిండాల వైద్య నిపుణుడు డాక్టర్ అశోక్ సరిన్‌కు సన్నిహితంగా ఉండే ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నీ ముఠా వెనుక ఉన్న మాస్టర్ మైండ్ వ్యక్తిగా అనీష్ అని పోలీసులు గుర్తించారు.

ఈ కిడ్నీ రాకెట్ ముఠాపై ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పోలీసులకు ఎటువంటి సాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో యాజమాన్యం చెప్పింది.

English summary
Police claimed to have busted a kidney trade racket operating in Delhi’s Apollo Hospital, following the arrest of six people, including two women. The police were tipped off about the gang’s presence in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X