• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Killer: ముగ్గురు భార్యలు, మూడు హత్యలు, ఎర్రగులాబీల కమల్ హాసన్ వేస్ట్, ఆంటీ దెబ్బ !

|

చెన్నై/ బెంగళూరు: హత్యలు చేసి తప్పించుకోవడంలో మనోళ్లు రాటుతేలిపోయారు. కమల్ హాసన్, అందాలతార శ్రీదేవి నటించిన ఎర్రగులాబీలు సినిమాను తలతన్నేలాగా ఓ వ్యక్తి మూడు హత్యలు చేసి చాకచక్యంగా కొన్ని సంవత్సరాలు తప్పించుకున్నాడు. ఇంటి మరమత్తులు చేస్తున్న సమయంలో ఇంట్లో హస్తి పంజరాలు బయటపడటంతో ఆ ఇంటి యజమానురాలై ఆంటీ హడలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కూపీలాగితే డొంక కదిలింది. మూడు పెళ్లిళ్లు చేసుకుని మస్త్ మజా చేసిన కేటుగాడే ఆ మూడు హత్యలు చేశాడని పోలీసులు గుర్తించారు. సినిమా స్టైల్లో హత్యలు చేసిన ఆ కేటుగాడి విషయం వెలుగు చూడటంతో స్థానికులు షాక్ అయ్యారు.

Illegal affair: భర్తను చంపేసి ప్రియుడితో ఎస్కేప్, ఫామ్ హౌస్ లో ఎంజాయ్, ఫోన్ కాల్ ?Illegal affair: భర్తను చంపేసి ప్రియుడితో ఎస్కేప్, ఫామ్ హౌస్ లో ఎంజాయ్, ఫోన్ కాల్ ?

సరోజ్ ఆంటీ షాక్

సరోజ్ ఆంటీ షాక్

హర్యానాలోని పానిపట్ శివ నగర్ లో సరోజ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో మూడు అస్థిపంజరాలు దొరికాయని


ఆ ఇంటి ఓనర్ అయినా సరోజ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన ఇంటికి మరమ్మత్తులు చేస్తూ ఉండగా ఒక గదిలో పాతి పెట్టిన మూడు అస్తిపంజరాలు బయటపడ్డాయని సరోజ్ పానిపట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

పవన్ ఎంట్రీ

పవన్ ఎంట్రీ


2017లో తాను ఈ ఇంటిని పవన్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని సరోజ్ పోలీసులకు చెప్పింది. పోలీసులు వపన్ అడ్రస్ తెలుసుకుని అతన్ని విచారణ చేశారు. తాను కొన్ని సంవత్సరాల క్రితం అహసాన్ సైఫీ అనే వ్యక్తి నుంచి కొన్నానని, తరువాత ఆ ఇంటిని సరోజ్ కు అమ్మేశానని పవన్ పోలీసులకు చెప్పాడు.
పోలీసుల ఇంటరాగేషన్లో హడలిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి.

 మొదటి నుంచి తేడానే

మొదటి నుంచి తేడానే

మొదటినుంచి అహసాన్ సైఫీ ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉండేదని అతని ఇరుగు పొరుగువారు పోలీసులకే చెప్పారు. ఒక కేసులో అహసాన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులకు తెలిసింది. అంతే అహసాన్ సైఫీ మీద పానిపట్ పోలీసులు నిఘా వేశారు. అహసాన్ తీరుపై అనుమానం పెరిగిపోవడంతో పోలీసులు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండో భార్య, కొడుకు, అల్లుడు హత్య

రెండో భార్య, కొడుకు, అల్లుడు హత్య

అహసాన్ సైఫీ అతని రెండో భార్య నాజ్నీన్, అతని 15 ఏళ్ల కొడుకు, తన భార్య సమీపబంధువు (అల్లుడు) తో సహ ముగ్గురిని తానే చంపి ఇంట్లో పాతి పెట్టానని పోలీసుల విచారణలో అంగీకరించాడు.


కార్పెంటర్ పనిచేసే అహసాన్ సైఫీకి అప్పటికే ఒక భార్య ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెళ్లి సంబంధాల సైట్లలో (మాట్రిమోని వెబ్ సైట్) తన ఫోటోలు అప్లోడ్ చేసి పెళ్లి పేరుతో యువతులను ఆకర్షించే వాడని పోలీసుల విచారణలో బయటపడింది.

మొదటి భార్య ఎఫెక్ట్

మొదటి భార్య ఎఫెక్ట్

ఒక మాట్రిమోనీ సైట్ లో పరిచయం అయిన నాజ్నీన్ దగ్గర తన మొదటి పెళ్లి విషయం దాచిపెట్టిన అహసాన్ సైఫీ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.


కొంతకాలానికి అహసాన్ మొదటి భార్య బండారం బయట పడడంతో నాజ్నీన్ రెచ్చిపోయింది. మొదటి భార్యతో కలవనీయకుండా రోజూ రెండో భార్య నాజ్నీన్ అడ్డుపడసాగింది. ఎలాగైనా రెండో భార్యను లేపేయాలని అహసాన్ డిసైడ్ అయ్యాడు.

ఇల్లు అమ్మేసి మూడో పెళ్లాంతో జల్సాలు

ఇల్లు అమ్మేసి మూడో పెళ్లాంతో జల్సాలు

మొదటి భార్య దగ్గరకు వెళ్లకుండా చేస్తున్న రెండో భార్య నాజ్నీన్ ను, రెండో భార్య పదహైదేళ్ళ కొడుకు సొహైల్, నాజ్నీన్ పదహైదేళ్ల మేనల్లుడు షబీర్ కు విషమిచ్చి చంపిన అహసాన్ సైఫీ ఇంట్లోనే మూడు శవాలు పాతి పెట్టాడు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా పవన్ కు ఇళ్లు అమ్మేసిన అహసాన్ సైఫీ వచ్చిన డబ్బుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెను మూడో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేశాడని పోలీసులు అన్నారు.

సైఫీ చేసిన పాపం ఊరికే పోలేదు

సైఫీ చేసిన పాపం ఊరికే పోలేదు

ఉత్తరప్రదేశ్ కు చెందిన అహసాన్ సైఫీ మొదటి నుంచి కామాంధుడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కార్పెంటర్ పని చెయ్యడానికి పానిపట్ వెళ్లి అక్కడ పని చేస్తూనే సొంత ఇల్లు కొనుగోలు చేశాడని. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని ఆమెను చంపేశాడని పోలీసులు అన్నారు. మూడు హత్యలు చేసిన అహసాన్ సైఫీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, కమల్ హాసన్ ఎర్రగులాబీల సినిమాలో లాగా ముగ్గురిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టి ఇంతకాలం తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు. ఇంతకాలం అమాయకంగా ఉన్న అహసాన్ సైఫీ మూడు హత్యలు చేశారని వెలుగు చూడటంతో అతని స్నేహితులు హడలిపోయారు.

English summary
Killer: Panipat Police in Haryana has arrested a man from Uttar Pradesh for allegedly cheating three women and marrying them. He is also accused of having killed his second wife, his son and a relative when she discovered that he was already married to someone else.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X