వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఎస్టేట్ గార్డ్ హత్య: వారికి కొడనాడ్ కొట్టినపిండి, అనుమానాలు

దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో మూడు రోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్ హత్య జరిగింది. ప్రాపర్టీ డాక్యుమెంట్లకు సంబంధించే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో మూడు రోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్ హత్య జరిగింది. ప్రాపర్టీ డాక్యుమెంట్లకు సంబంధించే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు.

ఆ ఎస్టేట్ నాది!: 'కొడనాడు'పై మహిళ, జయలలితకు రెండో ఇల్లు ఆ ఎస్టేట్ నాది!: 'కొడనాడు'పై మహిళ, జయలలితకు రెండో ఇల్లు

ఈ మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్లే టార్గెట్‌గా ఈ హత్య జరిగిందని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

Killing at Kodanad tea estate: Jayalalithaa's property documents the target?

సోమవారం పలువురు వ్యక్తులు ఎస్‌యూవీ వాహనంలో వచ్చి, హత్య చేసినట్లుగా ఉంది. హత్య వెనుక డాక్యుమెంట్లు టార్గెట్ అని భావిస్తున్నప్పటికీ.. ఇంకా ఈ విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది.

కోయబత్తూరుకు చెందిన ఓ ఐటీ కంపెనీ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోంది. తాము అన్ని కోణాల్లోను కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, అలాగే ప్రాపర్టీ డాక్యుమెంట్లు టార్గెట్‌గా జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఫుటేజీ వివరాలు త్వరలో వస్తాయన్నారు.

అయితే, సెక్యూరిటీ గార్డును హత్య చేయడం వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని కనిపిస్తోందని చెబుతున్నారు. కాబట్టి వేరే కారణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

హత్య చేసిన వారికి ఆ ప్రాంతం చాలా కొట్టిన పిండిగా తెలుస్తోంది. వారికి అక్కడి పరిసరాలు బాగా తెలుసునని అంటున్నారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పూర్తి విషయాలు తెలిశాకే ఏం జరిగందనేది తెలుస్తుందంటున్నారు.

English summary
Were property documents the target of the persons who murdered a security guard at Jayalalithaa's Kodanad tea estate in Nilgiris? The police has managed to obtain vital evidence in this regard which includes footage from CCTVs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X