బీజేపీలోకి కిరణ్‌బేడీ: సంతోషమని కేజ్రీవాల్, చిట్టా విప్పుతా: షాజియా

న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు స్పందించారు. ఆమె రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. తాను గతంలో పలుమార్లు రాజకీయాల్లోకి రావాలని ఆమెను ఆహ్వానించానని చెప్పారు.

Kiran Bedi joins BJP: As it Happened

ఏఏపీ బండారం బయటపెడతా: షాజియా ఇల్మీ

రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బండారం బయటపెడతానని షాజియా ఇల్మీ చెప్పారు. అందుకోసమే తాను ఢిల్లీ ఎన్నికలకు పని చేస్తానని పేర్కొన్నారు. షాజియా ఇల్మీ బీజేపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి.

దీని పైన ఆమె స్పందించారు. తాను బీజేపీలో చేరుతానన్న వార్తలను ఆమె ఖండించలేదు, కొట్టివేయలేదు. బీజేపీలో చేరుతున్నారా అని ప్రశ్నిస్తే.. తనకు కొద్ది సమయం కావాలని ఆమె అన్నారు. బీజేపీ ఆమెను అరవింద్ కేజ్రీవాల్ పైన నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, షాజియా ఇల్మీ వ్యాఖ్యల పైన అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. తాను ఎప్పుటికీ ఆమెను గౌరవిస్తానని చెప్పారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో షాజియా ఇల్మీ బీజేపీ పైన దుమ్మెత్తి పోశారు. హిపోక్రసీ అంటేనే బీజేపీ అని దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+