వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార్ విశ్వాస్ సెక్సిస్ట్ రిమార్క్స్: పోలీసులకు కిరణ్ బేడీ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల సమరంలో పలు అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమపై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుమార్ విశ్వాస్ సెక్స్ పరమైన వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బిజెపి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

కిరణ్ బేడీపై తాను ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదని, తాను వ్యాఖ్యలు చేసినట్లు జరిగిన ప్రచారంలో నిజం లేదని కుమార్ విశ్వాస్ అన్నారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. కుమార్ విశ్వాస్ తనపై గౌరవానికి భంగం కలిగించే శృంగారపరమైన వ్యాఖ్యలు చేశారని కిరణ్ బేడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల ర్యాలీలో విశ్వాస్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె ఆరోపించారు.

 Kiran Bedi lodges police complaint against Kumar Vishwas’s 'sexist' remarks

దారుణమైన సెక్సిస్ట్, తప్పుడు ఆలోచనలతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం నుంచి మహిళలు ఏ విధమైన గౌరవాన్ని, భద్రతను ఆశిస్తారని ఆమె అడిగారు. పూర్తిగా సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారని, అక్రమంగా ఫోటోషాప్ చేసిన చిత్రాతలతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అనైతికమని ఆమె అన్నారు.

కిరణ్ బేడీ ఆరోపణలను విశ్వాస్ ఖండించారు. కిరణ్ బేడీ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. తనకు సంబంధించిన వీడియోలను చానెళ్లు చూపించడం లేదని, చాలా చానెళ్ల కెమెరాలున్నాయని, ఎన్నికల కమిషన్ కెమెరాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రచారంలో వెనకబడిపోయామనే ఉద్దేశంతో బిజెపికి చెందిన చానెల్ పుకార్లను ప్రచారం చేసే పనిలో పడిందని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయాలని తాను కిరణ్ బేడీని, బిజెపిని సవాల్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను బిజెపిపై వ్యాఖ్యలు చేశానే గానీ కిరణ్ బేడీపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
BJP's Chief Ministerial candidate Kiran Bedi on Saturday filed a police complaint against AAP's Kumar Vishwas accusing him of making sexist comments against her while her party approached the Election Commission on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X