వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిచ్చు: లాలా లజపత్ రాయ్ విగ్రహానికి కిరణ్ బేడీ స్క్వార్ఫ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ విగ్రహానికి పార్టీ స్క్వార్ఫ్ కట్టారు. దీంతో వివాదం చెలరేగింది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బుధవారం ఆమె లాలా లజపత్ రాయ్ విగ్రహం చుట్టూ స్క్రార్ఫ్ చుట్టారు. దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కిరణ్ బేడీ లాలా లజపత్ రాయ్‌కి నివాళులు అర్పిచారు. విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత దాని చుట్టూ కాషాయం రంగు బిజెపి చిహ్నం ఉన్న పట్కా కట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె దాన్ని తీసేశారు.

Kiran Bedi puts BJP scarf around Lala Lajpat Rai's statue, triggers controversy

రోడ్ షోను ప్రారంభించడానికి ముందు కిరణ్ బేడీ చాయ్, న్యూస్ పేపర్ సెల్లర్స్‌ను కలిసి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు కాషాయం రంగు పులుమవద్దని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులు ఏ ఒక్క పార్టీకో చెందినవారు కాదని, దేశానికి చెందినవారని ఆయన అన్నారు

స్వాతంత్ర్య సమరయోధులను కాంగ్రెసు, బిజెపి అనో, మరో పార్టీ అనో విభజించకూడదని ఆయన అన్నారు. కిరణ్ బేడి బిజెపి అభ్యర్థిగా కృష్ణనగర్ నుచంి పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఎన్నికలు ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.

English summary
BJP’s Chief Ministerial candidate Kiran Bedi on Wednesday stoked a controversy by putting her party's scarf around the statue of freedom fighter Lala Lajpat Rai in Krishna Nagar before filing her nomination, which drew sharp criticism from AAP convener Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X