వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ మనవరాలినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా! కిరణ్ బేడిపై చిన్నారి సంచలన ఆరోపణలు!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఆమె మనవరాలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కిరణ్ బేడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన తండ్రిని ఇబ్బందులు పెడుతున్నారని ఆ చిన్నారి ఆరోపించింది. దీనికి సంబంధించి చిన్నారి తీసిన సెల్ఫీ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం పోస్ట్ చేసిన వీడియోను కోర్టు ఆదేశాల మేరకు డిలీట్ చేశారు.

<strong>సివిల్స్ లో ర్యాంకు సాధించిన జాతీయ ఉపాధి హామీ కూలీ కుమార్తె</strong>సివిల్స్ లో ర్యాంకు సాధించిన జాతీయ ఉపాధి హామీ కూలీ కుమార్తె

అమ్మమ్మ ఇబ్బందులు పెడుతోంది

అమ్మమ్మ ఇబ్బందులు పెడుతోంది

దాదాపు 45 సెకన్ల నిడివి గల వీడియోలో చిన్నారి తన అమ్మమ్మ (కిరణ్‌బేడి) వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసులతో బెదిరించి తన తండ్రిని ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని ప్రశ్నించింది. గతంలో తన తల్లి, తండ్రిని చెప్పుతో కొట్టి, ఉమ్మేసి, హింసిస్తోందని చెబితే అది భార్యభర్తల మధ్య వ్యవహారమన్న మీరు.. ఇప్పుడు మీ పలుకుబడి ఉపయోగించి పోలీసులతో తన తండ్రిని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది.

తండ్రి వద్ద సంతోషంగా ఉన్నా

తండ్రి వద్ద సంతోషంగా ఉన్నా

తన మనవరాలిని కిడ్నాప్ చేశారంటూ కిరణ్ బేడి చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదని చిన్నారి స్పష్టం చేసింది. తాను ఇష్టపూర్వకంగా తండ్రి దగ్గరకు వచ్చాయని, ఆయన దగ్గర సురక్షితంగా, సంతోషంగా ఉన్నానని చెప్పింది. తనను తండ్రి నుంచి వేరు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కిరణ్ బేడిని నిలదీసింది. మీరు చేసిన పనులు చూస్తుంటే మీ మనవరాలినని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉండని వాపోయింది.

కోర్టు ఆదేశంతో వీడియో డిలీట్

కోర్టు ఆదేశంతో వీడియో డిలీట్

దీపికా భరద్వాజ్ అనే ఫిల్మ్ మేకర్ గురువారం ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కిరణ్ బేడీ కోర్టును ఆశ్రయించడంతో వీడియో డిలీట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వీడియోను డిలీట్ చేసినా అప్పటికే దాన్ని ట్విట్టర్‌లో 77,500వేల మంది చూశారు.

English summary
Puducherry Lieutenant Governor Kiran Bedi’s granddaughter accuse her of misusing "police influence" apparently to separate her from her father. Bedi’s granddaughter made a selfie video and uploaded it on social media expressing her grandmother and mother’s doing with her father, Mr Ruzbeh N. Bharucha. As expected, the video has gone viral on the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X