• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిరణ్‌ది పార్టీ పెట్టరు, తప్పు కాదు: వాయలార్, టిపైనా

By Srinivas
|

vayalar ravi
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ పట్ల నిబద్ధత గల వ్యక్తి అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి సోమవారం అన్నారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పవచ్చునని, అందులో తప్పు లేదన్నారు.

తెలంగాణ బిల్లు వ్యవహారం తన పరిధిలో లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం పైనా వాయలార్ స్పందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతారన్నారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెసు నష్టపోతుందనేది కిరణ్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

పొత్తుపై బాబు ఎప్పుడు మాట్లాడలేదు: సోమిరెడ్డి

తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పైన ఎప్పుడు మాట్లాడలేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొత్తుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు. కిషన్ రెడ్డి కర్నాటక నేత గాలి జనార్దన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ అన్నారు.

చిత్తశుద్ధి లేదు: ఎర్రబెల్లి

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలనే చిత్తశుద్ధి లేకుండా పోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. బిల్లు పైన వెంటనే చర్చ జరపాలన్నారు. ఆందోళన చేసే వారిని బయటకు పంపించి సభ నడిపించాలన్నారు.

English summary
Congress Party senior leader Vayalar Ravi on Monday said Chief Minister Kiran Kumar Reddy will not float new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X