వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రికి తప్పిన ప్రమాదం, చాకచక్యంగా పొలాల్లో చాపర్ దించిన పైలట్

కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

|
Google Oneindia TeluguNews

ఈటానగర్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

కిరణ్ రిజిజు, సిబ్బంది, మరో ఏడుగురు వ్యక్తులు గౌహతి నుంచి ఎంఐ-17 హెలికాప్టర్ లో వెళుతున్నారు. అయితే, భారీ వర్షాలు, పొగ మంచు కారణంగా హెలికాప్టర్ ముందుకు వెళ్లేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ పొలంలో పైలట్ దానిని దించాడు.

kiren-rijiju-s-chopper-makes-emergency-landing-itanagar-safe

ఎటువంటి ప్రమాదం జరగకుండా హెలికాఫ్టర్‌ను కిందకు దింపేందుకు బీఎస్ఎఫ్ పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డ నేను చాలా అదృష్టవంతుడిని అని, ఎంతో అనుభవజ్ఞులైన బీఎస్ఎఫ్ పైలట్లకు తన కృతజ్ఞుతలు అని చెప్పారు.

సమాచారం తెలుసుకున్న ఇటానగర్ ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చారని, సాయపడేందుకు స్థానికులు కూడా ముందుకువచ్చినట్టు ఆయన చెప్పారు.

English summary
Bad weather forced a BSF chopper carrying Union Minister of State for Home Kiren Rijiju to make an emergency landing in a polytechnic playground in Itanagar on Tuesday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X