వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు ముందుకు మహా ట్విస్ట్ పిటిషన్: వాదనలు వినిపించేది వీరే, ఆలకించే ధర్మాసనం ఇదే..

|
Google Oneindia TeluguNews

మెజార్టీ లేకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్ భగత్ సింగ్ కొషియారి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్లను ఉమ్మడి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మరికాసేపట్లో ధర్మాసనం పిటిషన్ల విచారణ చేపడుతుంది.

సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ శివసేన, ఎన్సీపీ తరపున తమ వాదనలను వినిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ అడ్వకేట్ దేవదత్త్ కామట్ వాదనలు కొనసాగిస్తారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తమ వాదనలను ధర్మాసనం దృష్టికి తీసుకొస్తారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు. వాస్తవానికి ఇవాళ ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు.. కానీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

KK Venugopal to represent Maharashtra governor in SC

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడంతో రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. అజిత్ పవార్‌పై శివసేన నేతలు మండిపడుతున్నారు. ఫడ్నవీస్ ఓ దొంగలాగా శనివారం ఉదయం ప్రమాణం చేశారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ విమర్శించారు. అజిత్ పవార్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేదని తేలిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితికి బీజేపీ-అజిత్ పవార్ కారణమని మండిపడ్డారు.

English summary
Attorney General of India, KK Venugopal, will be representing Maharashtra Governor Bhagat Singh Koshiyari in the Supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X