వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్ క్రాష్, భ్రమలు పటాపంచలు: బుక్ క్షిపణి కథ

By Pratap
|
Google Oneindia TeluguNews

మాస్కో: మలేషియా విమానాన్ని ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో బుక్ క్షిపణితో పేల్చివేసినట్లు చెబుతున్నారు. 33 వేల అడుగుల ఎత్తున ఎగురతూ వెళ్లి విమానాలను భూమి మీది నుంచి పేల్చడం సాధ్యం కాదనే భ్రమలను బుక్ క్షిపణి పటాపంచలు చేసింది. మలేషియా బోయింగ్ 777 విమానం కూలడంతో మొత్తం 298 మంది మరణించారు.

ఉగ్రవాదులు బుక్ క్షిపణిని ప్రయోగించి విమానాన్ని కూల్చారని భావిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ద్వారా విమానాన్ని పేల్చివేసినట్లు అణెరికా నిఘా సంస్థలు తేల్చాయి. విమానం కూలడానికి ముందు రాడార్‌‌లో భూఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వ్యవస్థ కనిపించిందని, అది విమానాన్ని తాకినట్లు అర్థమవుతోందని చెప్పాయి.

వాస్తవానికి తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు గ్రూపులు ప్రభుత్వ విమానాలను, హెలికాప్టర్లను కూల్చడానికి షార్ట్ రేంజ్ భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులను వాడుతున్నారు. అయితే, అటువంటి క్షిపణులు 33 వేల అడుగుల ఎత్తున ఎగిరే విమానాలను చేరుకోలేవని నిపుణులు అంటున్నారు.

Know about Buk missiles that shot down MH17

అయితే, మలేషియా విమానం కూల్చివేతకు రష్యా తయారు చేసిన వాహకంతో కూడిన బుక్ క్షిపణిని ప్రయోగించి ఉంటారని, దాన్ని రష్యా తయారు చేసిందని చెబుతున్నారు. తిరుగుబాటుదారులు రష్యా తయారు చేసిన బుక్ క్షిపణిలను పొందారని ఉక్రెయిన్ అధికార వర్గాలు ఇటీవల చెప్పాయి.

బుక్ - ఎ1 క్షిపణి భూఉపరితలం నుంచి భూఉపరితలానికి ప్రయోగించేది. దీన్ని రష్యా 1970లో తయారు చేసింది. కాలక్రమంలో డిజైన్లను మార్చి ఆధునీకరించి అప్‌గ్రేడ్ చేశారు. ఉక్రెయిన్ బలగాలను దీన్ని ఉపయోగిస్తాయి. అయితే, దాన్ని భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిగా ఇది మారింది.

బుక్ రాడార్ సహాయంతో లక్ష్యాన్ని అంచనా వేయకుండానే, చూడకుండానే ప్రయోగించడానికి పనికి వస్తుంది. 2008లో రష్యా - జార్జియా యుద్ధంలో ఇరు పక్షాలు దాన్ని ఉపయోగించాయి. రష్యాకు చెందిన నాలుగు విమానాలను కూల్చడానికి జార్జియా వాటిని ప్రయోగించింది.

English summary
A Malaysia passenger airliner MH17 that crashed near the Ukraine-Russia border was shot down by missile, say reports. The passenger plane en route from Amsterdam to Kuala Lumpur was carrying 280 passengers and 15 crew members on board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X