• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒకప్పుడు హార్స్ ఫార్మ్ నేడు కరోనావైరస్ వ్యాక్సిన్‌కు ఆలయం..ప్రపంచం దృష్టి ఈ భారత సంస్థ వైపే..!

|

పూణే: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేలో ఉంది. దీనిపేరు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ‌తయారు చేస్తున్న ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ సంస్థ పూణేలోని ఈ ఇన్స్‌టిట్యూట్‌తో జతకట్టిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనంను ప్రచురించింది. మే నెలలోనే ఆక్స్‌ఫర్డ్ పూణేలోని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు కరోనావైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన సెల్యులార్ మెటీరియల్‌ను పంపింది. ప్రస్తుతం దీనిపైనే ప్రపంచం ఆశలు పెట్టుకుంది. ఇంతకీ సీరం ఇన్స్‌టిట్యూట్ ఏంటి..? ఈ కంపెనీ యజమానులు ఎవరు..? ప్రపంచవ్యాప్తంగా ఇది ఎందుకు పాపులర్ అయ్యింది. ..?

సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా

సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా

పూణేలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను నడుపుతున్నది భారత్‌లోని అత్యంత ధనిక కుటంబాల్లో ఒకటి. ముందుగా దీన్ని ఒక గుర్రపు ఫార్మ్‌గా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మాత్రం కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. కొన్ని మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను తయారీ చేయడంలో ఈ సంస్థ నిమగ్నమైంది. ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఒక వేళ అనుకున్నవన్నీ సవ్యంగా జరిగి వ్యాక్సిన్ బయటకు వస్తే మాత్రం ఈ కంపెనీ యజమాని అదార్ పూణావాలా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోతుంది. ఈ కష్ట సమయంలో ప్రపంచం ఏమైతో కోరుతుందో అది పూణావాలా చేతిలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నిమిషానికి 500 డోసులు

నిమిషానికి 500 డోసులు

వ్యాక్సిన్ తయారు చేయడంలో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలతో జతకట్టిన సీరం ఇన్స్‌టిట్యూట్ సంస్థ... ఏప్రిల్ నెలలోనే ఎంతో సాహసోపేతమైన ప్రకటన చేసింది. వ్యాక్సిన్ అధిక సంఖ్యలో తయారు చేస్తామంటూ ప్రకటించింది. ఇది క్లినికల్ ట్రయల్స్‌ కంటే ముందే తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక చెప్పినట్లుగానే నిమిషానికి 500 డోసులను తయారు చేస్తోంది. దీంతో పూణావాలాకు ప్రపంచ దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తమకు వ్యాక్సిన్‌ను ఇవ్వాలంటూ ఆయా దేశ ప్రభుత్వాలు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఈ సంస్థ పలు రకాల వ్యాధులకు సంబంధించి ప్రతి ఏటా 1.5 బిలియన్ డోసులు తయారు చేసి పేద దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ స్థాయిలో మరే కంపెనీ తయారు చేయడం లేదు. ప్రపంచంలోని సగానికి పైగా చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్ సీరం సంస్థలో తయారైనేదే కావడం విశేషం.

50శాతం భారత్‌కు మరో 50శాతం ఇతర దేశాలకు..

50శాతం భారత్‌కు మరో 50శాతం ఇతర దేశాలకు..

ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్‌ను తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇందులో భారత్ ఎంత వినియోగించుకుంటుందనే దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే పూనావాలా కంపెనీపై ఇటు రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో ముందుగా భారత్ అవసరాలు తీర్చుకునేలా ఉండాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర దేశాలకు కొన్ని ఔషధాల ఎగుమతిని సైతం నిషేధించింది. ఇదిలా ఉంటే తమ సంస్థలో తయారయ్యే వ్యాక్సిన్‌ను 50శాతం భారత్‌కు వినియోగిస్తామని మరో 50 శాతం ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు పూణావాలా. ఇందులో ఎక్కువగా పేదదేశాలకే ఎగుమతి చేస్తామని చెప్పడంతో ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒప్పుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడించింది.

 50 క్రితం సీరం ఇన్స్‌టిట్యూట్ ప్రారంభం

50 క్రితం సీరం ఇన్స్‌టిట్యూట్ ప్రారంభం

ఇదిలా ఉంటే పూణవాలా కుటుంబానికి సంబంధించిన ఈ సంస్థ 50 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ముందుగా హార్స్ బ్రీడింగ్ ఫార్మ్‌గా ఉండేది. అంటే ఈ గుర్రాలను వ్యాక్సిన్‌ ప్రయోగం కోసం వ్యాక్సిన్ ల్యాబొరేటరీలకు దానంగా ఇచ్చేవారు. అయితే ఇది ఇతరులు ఎందుకు చేయాలి తామే వ్యాక్సిన తయారు చేయొచ్చనే ఆలోచన పూణావాలా తండ్రి సైరస్ వాలకు తట్టింది. దీంతో తానే ఈ సంస్థలో గుర్రాలకు టాక్సిన్స్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఆపై గుర్రాల రక్తం నుంచి బ్లడ్ సీరంను తీసి వాటితో వ్యాక్సిన్ తయారు చేశారు. ముందుగా టెటానస్ వ్యాక్సిన్‌తో 1967లో ప్రారంభించారు. టెటానస్ అనేది పాము కాటుకు విరుగుడుగా తీసుకురావడం జరిగింది.అనంతరం టీబీ, హెపటైటిస్, పోలియో, ఫ్లూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వ్యాక్సిన్ సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచే తయారు చేయడం జరిగింది. ఇక వ్యాక్సిన్ తయారు చేయడంలో అందెవేసిన చేయిగా మారడంతో సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాకు యూనిసెఫ్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థల నుంచి భారీగా కాంట్రాక్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు 450 మిలియన్ డాలర్లను ఖర్చుచేస్తున్నట్లు పూనవాలా చెప్పారు.

English summary
The world’s largest vaccine producer, the Serum Institute, announced a plan to make hundreds of millions of doses of an unproven inoculation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X