వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్నీ లియోన్‌పై కేసు: క్రైమ్ బ్రాంచ్ అదుపులో మాజీ పోర్న్‌స్టార్: స్టేట్‌మెంట్‌లో

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌పై ఫ్రాడ్ కేసు నమోదైంది. 29 లక్షల రూపాయల మేర మోసగించిన కేసులో ఆమెపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని, విచారించారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కేర‌ళ‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంసథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కోచి పోలీసులు ఫ్రాడ్ కేసును నమోదు చేశారు. ఆ ఈవెంట్ సంస్థ నుంచి 29 లక్షల రూపాయల మేర చెక్కును అందుకున్న తరువాత.. ముఖం చాటేశారంటూ సన్నీ లియోన్‌పై కేసు నమోదైంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేసిన వైఎస్ జగన్: ప్రైవేటీకరణను అడ్డుకునేలా రెండంచెల మాస్టర్ ప్లాన్విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేసిన వైఎస్ జగన్: ప్రైవేటీకరణను అడ్డుకునేలా రెండంచెల మాస్టర్ ప్లాన్

2017లో సన్నీ లియోన్.. కోచిలో ఓ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. అప్పట్లో వేలాదిమంది ఆమెను చూడటానికి ఎగబడ్డారు. ఆ కార్యక్రమం అనుకున్న దాని కంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ ఈమెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆమెతో ఓ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. అయిదేళ్ల పాటు ఆ సంస్థ నిర్వహించే 12 ఈమెంట్లకు ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. దీనికోసం 29 లక్షల రూపాయలను ఆ కంపెనీ సన్నీ లియోన్‌కు అందజేసింది. ఒప్పందం ప్రకారం.. ఆమె తాము ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు కావట్లేదనేది ఆ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వాదన.

Kochi Crime Branch recorded the statement of actor Sunny Leone an alleged financial fraud

29 లక్షల రూపాయలను అందుకున్న తరువాత సన్నీ లియోన్ ముఖం చాటేశారంటూ ఈవెంట్ కోఆర్డినేటర్ శ్రియాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయిదు ఈవెంట్లకు సంబంధించిన షెడ్యూళ్లకు హాజరు కావడానికి తాను అంగీకరించానని, అనివార్య కారణాల వల్ల ఆ అయిదు కార్యక్రమాలు కూడా సంబంధిత మేనేజ్‌మెంట్ కంపెనీ వాయిదా వేసిందని ఆమె తెలిపారు. తన కాల్షీట్లకు అనుగుణంగా అవి షెడ్యూల్ చేయకపోవడం వల్లే తాను హాజరు కాలేకపోయానని పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

English summary
Kerala: Kochi Crime Branch recorded the statement of actor Sunny Leone on Friday night in connection with an alleged financial fraud of Rs 29 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X