వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కొడనాడు ఎస్టేట్ లో బ్లాక్ మనీ ? మావోయిస్టులు దాడి చేశారని !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన నిలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య కేసును తమిళనాడు పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

జయలలిత కొడనాడు ఎస్టేట్ లో హత్య జరగడంతో మంగళవారం మరో విషయం తెరమీదకు వచ్చింది. జయలలిత కొనడాడు ఎస్టేట్ లో భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని, అందుకోసం అక్కడ మావోయిస్టులు దాడి చేసి హత్య చేసి పరారైనారని ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలో నిలగిరి జిల్లా పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిలగిరి జిల్లాలో

నిలగిరి జిల్లాలో

కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో నీలగిరి జిల్లా ఉంది. జయలలితకు చెందిన 900 ఎకరాల కొడనాడు టీ ఎస్టేట్ నీలగిరి జిల్లాలోనే ఉంది. జయలలిత మరణించిన తరువాత ఇక్కడికి శశికళ కుటుంబ సభ్యులు తప్పా మరెవ్వరూ రావడం లేదు.

జయలలిత రాకపోకలు ఎక్కువే

జయలలిత రాకపోకలు ఎక్కువే

జయలలిత ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలంటే మొదటి ప్రాధాన్యత కొడనాడు ఎస్టేట్ కు ఇస్తారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అలాంటి కొడనాడు టీ ఎస్టేట్ లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అని అందరూ ఊహించుకుంటుంటారు.

సీసీ కెమెరాలు బయట మాత్రమే

సీసీ కెమెరాలు బయట మాత్రమే

జయలలిత కొడనాడు ఎస్టేట్ లోని బంగ్లాలోపల ఎలాంటి సీసీ కెమెరాలు లేవని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. బంగ్లా బయటమాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి క్లిప్పింగ్స్ పరిశీలించామని పోలీసు అధికారులు అంటున్నారు.

భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని ?

భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని ?

కొడనాడు ఎస్టేట్ లో భారీ మొత్తంలో జయలలిత బ్లాక్ మనీ దాచి పెట్టారని గతంలో ఆరోపణలు వచ్చాయి. జయలలిత కొడనాడు టీ ఎస్టేట్ లోకి ఎవ్వరికీ ప్రవేశం లేకపోవడంతో కొంత మంది ప్రజలు ఆ ఆరోపణలు నిజమే అని అనుకున్న సందర్బాలు ఉన్నాయి.

మావోయిస్టులు దాడి చేశారని ?

మావోయిస్టులు దాడి చేశారని ?

జయలలిత కొడనాడు ఎస్టేట్ లో భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న కేరళ, కర్ణాటకలోని మావోయిస్టులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి సెక్యూరిటీ గార్డును హత్య చేశారని వార్తలు గుప్పుమనడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆస్తుల కోసం అంటూ

ఆస్తుల కోసం అంటూ

జయలలిత ఆస్తుల పత్రాలు చోరీ చెయ్యడానికి సెక్యూరిటీ గార్డును హత్య చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు ఇప్పటికే ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నీలగిరి జిల్లా ఎస్పీ హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఆ రెండు విషయాలపైన పోలీసుల దృష్టి

ఆ రెండు విషయాలపైన పోలీసుల దృష్టి

జయలలిత ఆస్తుల పత్రాలు చోరీ చెయ్యడానికి, బ్లాక్ మనీ లూటీ చెయ్యడానికి మావోయిస్టులు దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆ రెండు విషయాల మీద ఎక్కువ దృష్టి సారించారని సమాచారం.

శశికళ ఫ్యామిలీని విచారిస్తారా ?

శశికళ ఫ్యామిలీని విచారిస్తారా ?

కొడనాడు ఎస్టేట్ చూసుకుంటున్న శశికళ కుటుంబ సభ్యులను విచారించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటి వరకు శశికళ కుటుంబ సభ్యులను విచారించామని పోలీసులు మాత్రం చెప్పలేదు. ఎమైనా రహస్యంగా విచారణ చేశారా ? అనే విషయం వెలుగు చూడవలసి ఉంది.

కేరళ, కర్ణాటకలో ?

కేరళ, కర్ణాటకలో ?

జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేరళ, కర్ణాటకలో విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని సమాచారం. అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఆరు ప్రత్యేక టీఎంలు కేరళ, కర్ణాటక వెళ్లి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని సమాచారం.

English summary
Black money or jayalalitha's will? - Is this the reason behind theft and murder in kodanadu estate police investigating the case in these aspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X