వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు: ఢిల్లీలో నిలిపేసి తనిఖీలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, భద్రతా సిబ్బంది విమానాన్ని కొద్దిసేపు నిలిపేసి వెంటనే తనిఖీలు చేపట్టారు.

ఎయిరిండియాకు చెందిన ఏఐ-020 విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతా బయల్దేరాల్సి ఉంది. మరికాసేపట్లో విమానం టేకాఫ్‌ అవుతుందనగా.. ఎయిరిండియా కాల్‌ సెంటర్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది.

 Kolkata-Bound Air India Flight Grounded At Delhi After Bomb Threat

ఏఐ-020 విమానంలో బాంబు ఉందని ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. దీంతో ఎయిరిండియా, ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే విమానంలోని ప్రయాణికులను దింపేసి.. తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు చేశారు.

బుధవారం మధ్యాహ్నం 2.45గంటల ప్రాంతంలో ఈ ఫాన్ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, ఈ వివామనంలో మొత్తం 248 ప్రయాణికులు, 11మంది విమాన సిబ్బంది ఉన్నారు.

English summary
A Kolkata-bound Air India flight has been grounded at the Delhi airport following reports of a bomb threat, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X