వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాజెడిగా మారిన మ్యాజిక్ : సంకెళ్లు కట్టుకొని నదిలో ఫీట్, బెడిసికొట్టి మృత్యువాత

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : మ్యాజిక్ .. కళ్ల ముందే మాయచేయడం. చూపరులు అటే చూస్తుంటారు .. కానీ మెజిషీయన్లు మాత్రం మాయ చేస్తుంటారు. ఆయా స్టేజీల వద్ద మ్యాజిక్ మనమంతా చూసే ఉంటాం. అలానే కొందరు ధైర్యంగా ముందుకొచ్చి రైళ్లపై, నదిలో మ్యాజిక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మ్యాజిక్‌లు ట్రాజెడీగా మారుతుంటాయి. చంచల్ లాహిరీ (40) అనే మెజిషీయన్ మ్యాజిక్ చేసి విగతజీవిగా మారాడు. దీంతో అతని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

 మాయ చేసి మాయమైపోయాడు ..

మాయ చేసి మాయమైపోయాడు ..

కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జీ. పైగా ఆదివారం .. జనమంతా గుమిగూడారు. ఏంటి అని చూస్తే అక్కడికొచ్చారు మన జాదుగర్ మాండ్రక్‌గా పేరుగాంచిన ప్రముఖ మెజిషీయన్ చంచల్ లాహిరీ. ఆయన వచ్చారంటే చాలు .. జనానికి ఏదో మ్యాజిక్ చేస్తారని అర్థమైపోయింది. ఏం చేస్తున్నారని నిర్వాహకులను అడిగితే .. వారు చెప్పిన సమాధానం విని అక్కడే నోరెళ్లబెట్టారు కొందరు ప్రజలు. తొలుత చంచల్ చేతులు, కాళ్లను ఇనుప సంకెళ్లతో బంధిస్తారు. తర్వాత క్రేన్ సహాయంతో నదిలో వదిలేస్తారు. ఇక అక్కడినుంచి ఆయన తిరిగి రావాలి. ఈ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పడంతో అక్కడున్న వారంతో కళ్లు దగ్గరికి చేసుకొని మరీ చూస్తున్నారు. అయితే సంకెళ్లు బిగించి, రోప్ కట్టి నదిలో వేశాక ... నిమిషాలు గడుస్తోన్న చంచల్ ఆచూకీ తెలియలేదు. దీంతో ఏం జరిగిందోనని ఆందోళన నెలకొంది. కానీ చంచల్ మాత్రం ఎంతకీ తిరిగిరాకపోవడంతో నదిలో వెతికారు. ఆయన మృతిచెందినట్టు తెలుపడంతో ఆయన అభిమానులు షాక్‌నకు గురయ్యారు.

అంతలోనే మాయం ..

అంతలోనే మాయం ..

చంచల్ కుటుంబసభ్యులు, మీడియా, పోలీసులు ఒడ్డున నిశీతంగా పరిశీలిస్తుండగా మ్యాజిక్ కోసం నదిలోకి మెల్లగా జారుకున్నారు చంచల్. తర్వాత మెల్లగా సంకెళ్లు విడిపించుకొని పైకి రావాలి. కానీ ఎంతకీ రాకపోవడంతో ఏం జరిగిందని ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు. వారు ఊహించినట్టే జరిగింది. నదిలో లోపలికి చంచల్ వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తనకు బంధించిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు. అయితే ఇదే నదిపై 21 ఏళ్ల క్రితం ఇలాంటి మ్యాజిక్ విజయవంతంగా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విషాదంగా మారింది.

గతంలో సక్సెస్ ..

గతంలో సక్సెస్ ..

గతంలో తనకు ఇనుప సంకెళ్లతోపాటు బుల్లెట్ ప్రూప్ గ్లాస్ బాక్స్ కూడా కట్టారని పేర్కొన్నారు చంచల్. నదిలో దిగకముందు మీడియాతో మాట్లాడారు. సంకెళ్లతో కట్టి .. గ్లాసు బాక్స్‌లో వేసి తనను నదిలో వేశారని గుర్తుచేశారు. కానీ 29 సెకండ్లలో బయటకు వచ్చానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వయస్సు దృష్ట్యా ఈ మ్యాజిక్ అవుతుందో లేదోనని సందేహం వ్యక్తం చేశారు. ఒకవేళ తన సంకెళ్లు తెగిపోయి బయటకు వస్తే మ్యాజిక్ అవుతుంది .. లేదంటే ట్రాజిక్ అవుతుందని తన మదిలో ఉన్న సందేహన్ని మొదట్లోనే చెప్పాడు చంచల్. ఆయన ఊహించినట్టే జరిగింది. ఇదే కాదు 2013లో కూడా చంచల్ మ్యాజిక్ చేశాడు. తనను ఓ పంజరంలో బంధించి .. తాను ఎలా బయటకు వస్తానో అని అక్కడ చూసేవారికి కనిపించేటట్టు మ్యాజిక్ కూడా చేశారు. చంచల్‌కు ఒక యూ ట్యూబ్ చానల్ ఉంది. అందులో తాను చేసిన మ్యాజిక్‌లను పోస్ట్ చేస్తుంటారు. అందులో చాలా వీడియోలో ఆశ్చర్యానికి గురిచేసేవి కూడా ఉన్నాయి.

English summary
40-year-old Mandrake, who tried to do tricks like the legendary magician of escape games Harry Houdini, drowned in river Hoogly in Kolkata while trying to perform an underwater live stunt on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X