వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ స్వపన్ సెట్.. 17 ఏళ్లుగా వయోలిన్‌ వాయిస్తూ.. నగరాలు చుట్టేసిన 77 ఏళ్ల వృద్దుడు

|
Google Oneindia TeluguNews

అందరీలా కాదు వారిద్దరూ.. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ అంతలా బాగుంటున్నారని ఏమో ఆ భగవంతుడు కష్టం తీసుకొచ్చాడు. అతని భార్యకు క్యాన్సర్ రక్కసి బారిన పడింది. ఆ వృద్దుడి బాధ వర్ణణాతీతం. అతని భార్యకు కష్టం వచ్చి 17 ఏళ్లు అవుతోంది. కానీ ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు తాపత్రయ పడుతూనే ఉన్నాడు. ఇందుకోసం వాయెలిన్ వాయిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 17 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాడు. అతని కష్టాన్ని కొందరు వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అతను చేస్తోన్న పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు. శభాష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

గర్భాయ క్యాన్సర్.. చికిత్స కోసం

గర్భాయ క్యాన్సర్.. చికిత్స కోసం


కోల్‌కతా బలరామ్ దే వీధికి చెందిన స్వపన్ సెట్‌ సోషల్ మీడియా హీరోను చేసింది. ఇతని భార్యకు గర్భాశయ క్యాన్సర్ సోకింది. 2002లో వ్యాధి నిర్ధారణ జరగగా.. ఆమె చికిత్స కోసం వయోలిన్ ప్లే చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ నిధులను సేకరిస్తున్నాడు. అంతేకాదు ఆయన పెయింటర్, శిల్పి కూడా. తన భార్య అనారోగ్యానికి సంబంధించి చికిత్స కోసం భారీగా డబ్బులు అవసరం అవుతాయని అంచనా వేశాడు. ఇంకేముంది వయోలిన్ ప్లే చేయడం హబీగా పెట్టుకున్నాడు. గత 17 ఏళ్ల నుంచి అలానే చేస్తూ.. చికిత్సకు అవసరం అయ్యే నగదును సమకూరుస్తున్నాడు.

2019లో క్యూర్.. కానీ

2019లో క్యూర్.. కానీ

2019లో అతని భార్య కోలుకున్నారు. కానీ అతను మాత్రం వయోలిన్ వాయించడం ఆపలేదు. తెల్లని కుర్తా ధరించి, ధోతి కట్టుకుని ప్లే చేసేవారు. ఇటీవల కోల్ కతాలో గల ఓ షాపింగ్ మాల్‌లో వయోలిన్ ప్లే చేసిన వీడియోను అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానిని చూసి ఒక్కొ నెటిజన్ ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఆ పోస్ట్‌కు వేలాది లైకులు వచ్చాయి. షేర్లు కూడా వచ్చాయి.

నెటిజన్ల ఫిదా

నెటిజన్ల ఫిదా

ఆ పోస్టుకు ఒక్కొక్కరు ఒక్కొలా కామెంట్ చేశారు. అతను గొప్ప వ్యక్తి అని రాశారు. మరికొందరు కలవాలని ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అతనికి మాటలతో ఉన్న సీడీ కొనుగోలు చేయాలని.. ఇదీ ఆయనకు సపోర్ట్ చేసినట్టు అవుతుందని చెప్పారు. ఫోరమ్ మాల్ వద్ద అతనిని చూశామని చాలా మంది పోస్ట్ చేశారు.

English summary
Swapan Sett, a resident of Kolkata’s Balaram Dey Street, garnered a big round of applause from the internet after his story went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X