• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చూసేందుకు మహిళే కానీ... షాకింగ్ నిజాలు..కాపురం సాధ్యమేనా.. డాక్టర్ల మాటేంటి..?

|

కోల్‌కతా: 30 ఏళ్లు ఆమె సాధారణ జీవితం గడిపింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కాలం వెల్లదీసింది. అయితే ఈ మధ్యనే ఏదో ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడే ఆమెకు అనుకోని నిజం తెలిసింది.. ఇంతకీ ఏంటా నిజం..?

 మహిళకు పురుషుల అవయవాలు

మహిళకు పురుషుల అవయవాలు

కోల్‌కతాలోని భీర్‌భూమ్ నివాసి అయిన ఓ మహిళ కడుపునొప్పితో నేతాజా సుభాష్ చంద్రబోస్ కేన్సర్ హాస్పిటల్‌కు వెళ్లింది . అక్కడ డాక్టర్లు టెస్టులు నిర్వహించగా ఆమెకు గర్భ సంచి లేదని నిర్ధారించారు. అంతేకాదు పురుషుల్లో కనిపించే టెస్టిక్యులర్ క్యాన్సర్ ఆ మహిళలో గుర్తించారు. ఈ విషయం బయటపడగానే ఆ మహిళ సోదరి కూడా పరీక్షలు చేయించుకుంది. ఆమె కూడా చూసేందుకు మహిళలానే ఉన్నా పురుషుల అవయవాలతో పుట్టిందని వైద్యులు గుర్తించారు.

రుతుస్రావం ఎప్పుడూ జరగలేదు

రుతుస్రావం ఎప్పుడూ జరగలేదు

9 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ మహిళ చూసేందుకు మహిళలానే కనిపిస్తుంది. అంటే తన గొంతు, బ్రెస్ట్, ఇతర బాహ్య అవయవాలన్నీ మహిళకు సంబంధించినవే ఉన్నాయి. కానీ గర్భసంచి, అండాశయం మహిళలో కనిపించలేదు. అంటే పుట్టినప్పటి నుంచే అవి లేవని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ దత్త చెప్పారు. అంతేకాదు ఈ మహిళకు ఎప్పుడూ రుతుస్రావం కూడా జరగలేదని డాక్టర్లు చెప్పారు.ఇది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పిన వైద్యులు ప్రతి 22వేల మంది మహిళల్లో ఒకరు ఇలా ఉంటారని వెల్లడించారు.

మహిళలో క్రోమోజోమ్ సమస్య

మహిళలో క్రోమోజోమ్ సమస్య

టెస్టుల సందర్భంగా సాధారణంగా మహిళల్లో xx క్రోమోసోమ్‌లు ఉండాల్సి ఉండగా... ఈ మహిళలో మాత్రం అందుకు భిన్నంగా XY క్రోమోసోమ్‌లు ఉన్నట్లు డాక్టరలు వివరించారు. టెస్టులు నిర్వహించిన సమయంలో ఆమెలో పురుషులకు ఉండే వృషణాలు( టెస్టికల్స్) ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ చికిత్స పొందుతోందని వెల్లడించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు.

  Good News ! Flexible Use Of Airspace To Cut Flight Delays
  భార్య భర్తలకు కౌన్సిలింగ్

  భార్య భర్తలకు కౌన్సిలింగ్

  ఇక ఆమె శరీరంలో టెస్టికల్స్ వృద్ధి చెందకపోవడంతో టెస్‌టాస్‌టెరాన్లు విడుదల జరగలేదని, ఆమెలో ఉన్న ఫీమేల్ హార్మోన్లు ఆమెకు మహిళా రూపాన్ని ఇచ్చాయని డాక్టర్ దత్ చెప్పారు. ఆ మహిళ చిన్నప్పటి నుంచే ఆడపిల్లలా పెరిగిందని అందరిలానే వివాహం చేసుకుందని చెప్పిన వైద్యులు కొత్తగా ఇది బయటపడటంతో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఇద్దరూ ఎలా అయితే జీవితం గడిపారో ఇకముందు కూడా అలాంటి జీవితమే గడపాలని భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డాక్టర్ దత్ చెప్పారు. ఇక పిల్లల కోసం చాలా ప్రయత్నించారని వీరికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆ మహిళలో గర్భసంచి లేకపోవడమే అని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఇలా జరగడం జన్యువు లోపమే అని వైద్యులు చెప్పారు.

  English summary
  A married woman who complained of abdominal pain was shocked to know that she actually had male testicles. This incident took place in Kolkata.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more