బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్జాతీయంగా వేగం: కోల్‌కతా, ముంబై, బెంగళూరులు దూసుకెళ్తున్నాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

సింగపూర్: ప్రపంచదేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో మన దేశంలోని ముంబై, కోల్‌కతా, బెంగళూరులకు చోటు లభించింది. లండన్‌కు చెందిన అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌, కన్సల్టింగ్‌ సంస్థ ఏటీ కెర్నే విడుదల చేసిన గ్లోబల్‌ సిటీస్‌ జాబితాలో అగ్రస్థానాల్లో న్యూయార్క్‌, లండన్‌ నిలిచాయి.

గ్లోబల్‌ సిటీస్‌ 2015 జాబితా రెండు భాగాలుగా ఉంది. అంతర్జాతీయ నగరాల జాబితా (జీసీఐ)తో పాటు, భవిష్యత్తులో ఎదిగే నగరాల (జీసీఓ) జాబితా ఉంది. 2008 నుంచీ ఆవిష్కరిస్తున్న జీసీఐ జాబితాలో ఇది అయిదోది.

125 నగరాలతో జీసీఐ జాబితా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు, సమాచార మార్పిడి, మానవ వనరులు, సాంస్కృతిక అనుభవం, రాజకీయ అనుబంధంలో ఇరవై ఆరు పరిమితులలో వృద్ధి ఆధారంగా ప్రపంచంతో ఎంతగా అనుసంధానం అవుతుందనేది గుర్తిస్తున్నారు.

 Kolkata, Mumbai, B'lore in fastest-growing global cities list

భారత్‌లోని మూడు నగరాలు ఈ అంశాలలో తమ స్థానాన్ని క్రమంగా మెరుగు పరచుకుంటున్నాయి. బ్రాడ్‌బ్యాండ్‌ ఖాతాదారుల పెరుగుదల వల్ల ఈ నగరాలలో సమాచార మార్పిడి మరింత అధికంగా ఉంది. భవిష్యత్తులో ఎదిగే సత్తా ఉన్న 125 నగరాల జాబితాతో జీసీఓను విడుదల చేసింది.

వ్యక్తిగత శ్రేయస్సు, ఆర్థిక పరిస్థితులు, వినూత్నత, పాలనాయంత్రాంగం తీరు వంటి నాలుగు అంశాలలో ఆయా నగరాలు సాగిస్తున్న ప్రగతి ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలో అహ్మదాబాద్, ఢిల్లీతో పాటు చైనాలోని బీజింగ్ ఉన్నాయి.

English summary
India's three metropolitan cities, Kolkata, Mumbai and Bangalore, have emerged as the top three fastest growing cities in A T Kearney's Global Cities Index, which is topped by New York and London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X