వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీషర్ట్, స్కర్ట్‌లకు కాలేజీలో నిషేధం: విద్యార్ధుల నిరసన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: నగరంలోని ఓ కాలేజీ యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్ధులను ఏమాత్రం సంప్రదించకుండా కాలేజీ యాజమాన్యం డ్రస్ కోడ్‌పై నిబంధనలు విధించడం తగదంటూ విద్యార్ధి సంఘాలు ఆందోళన బాట చేపట్టాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోల్‌కత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్ధులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అమ్మాయిలు మోకాళ్లకు బాగా కిందకు ఉండే స్కర్టులు, అబ్బాయిలు రౌండ్ నెక్ టీషర్ట్‌లు, టాప్స్ ధరించి రావద్దని సూచించింది.

Kolkata's Scottish Church College prescribes dress code, bans short skirts

వాటిపై ఎలాంటి స్లోగన్లు ఉండకూడదని కూడా పేర్కొంది. కాలేజీ వాతావరణానికి సరిపడే దుస్తులు మాత్రమే ధరించాలని ఆ నోటీసులో పేర్కొంది. ముఖ్యంగా విద్యార్ధినీ విద్యార్ధులు సల్వార్ కమీజులు, చీరలు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది.

అంతేకాదు, అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాని కూడా నోటీసులో తప్పుబట్టింది. కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విద్యార్ధి సంఘాలు సోమవారం నుంచి ఆందోళనకు దిగాయి. మరోవైపు విద్యావేత్తలు, మేధావులు ఈ నిర్ణయంపై విమర్శిస్తున్నారు.

విద్యావేత్త పబిత్రా సర్కార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక నిబంధనలేంటని ప్రశ్నించారు. ఉద్యమకారుడు మిరుతున్ నహార్ మాట్లాడుతూ విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇది తీరని భంగపాటు అని అన్నారు.

English summary
Recommending students to come in "unostentatious dress", the city's Scottish Church College has proscribed round-neck t-shirts and short and slit skirts, sparking off condemnation from students and academicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X