చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జస్టిస్ కర్ణన్ ను అరెస్టు చెయ్యాలని చెన్నైలో బెంగాల్ పోలీసు: ఎక్కడ ఉన్నారో !

చెన్నైలో ఉన్న పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసి కోల్ కతా తీసుకు వెళ్లడానికి సిద్దం అయ్యారు. అయితే జస్టిస్ కర్ణన్ చెన్నైలో ఎక్కడ ఉన్నారో అర్థం

|
Google Oneindia TeluguNews

చెన్నై: కోర్టు దిక్కరణ అభియోగాలను ఎదుర్కొంటున్న కోల్ కతా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సీఎస్. కర్ణన్ ను దోషిగా తేలుస్తూ ఆయన ఆరు నెలలు కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

జస్టిస్ సీఎస్. కర్ణన్ ను అరెస్టు చెయ్యడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం చెన్నై చేరుకున్నారు. సుప్రీం కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ చేత పట్టుకుని న్యాయమూర్తి కర్ణన్ ను అరెస్టు చేసి కోల్ కతా తీసుకు వెళ్లడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Kolkatta police arrive in Chennai to arrest Justice CS Karnan

జస్టిస్ కర్ణన్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్. ఖేహర్ (సీజేఐ) నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనం మంగళవారం పశ్చిమ బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఏడుగురు న్యాయమూర్తులకు ఐదేళ్లు చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు సోమవారం జస్టిస్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మరుసటి రోజే సుప్రీం కోర్టు జస్టిస్ కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలో ఉన్న జస్టిస్ కర్ణన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసి కోల్ కతా తీసుకు వెళ్లడానికి సిద్దం అయ్యారు. అయితే జస్టిస్ కర్ణన్ చెన్నైలో ఎక్కడ ఉన్నారో అర్థం కాక కోల్ కతా పోలీసులు అవస్థలు పడుతున్నారు.

English summary
A team of policemen from Kolkatta have arrived in Chennai to arrest Justice C S Karnan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X