వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొద్దున్నే మనసు కలిచివేసింది: కేరళ ఆలయ ప్రమాదంపై మోడీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలోని పుట్టింగల్ దేవాలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పొద్దున్నే ఈ వార్త తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందితో మాట్లాడానని తెలిపారు.

గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను కేరళ వెళ్తానని చెప్పారు. కొల్లాంలో దేవాలయ ప్రమాదం మాటలకందని షాకింగ్ అని, ఈ వార్త తన హృదయాన్ని కలచివేసిందని, మృతుల కుటుంబాలకు సంతాపం అని చెప్పారు.

గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ కేంద్రమంత్రి జేపీ నడ్డాను వెంటనే కొల్లాం వెళ్లాలని ఆదేశించారు. తాను కూడా కొల్లాం వెళ్తానని చెప్పారు. కాగా, కొల్లాం ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

కేరళలోని కొల్లంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో అగ్ని ప్రమాదం కారణంగా 102 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.

కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

కేరళలోని పుట్టింగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించి వంద మందికి పైగా మృతి చెందారు. కేంద్రం మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

సంఘటనలో గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందజేస్తామని కేంద్రం తెలిపింది. పుట్టింగల్ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు.

 కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 102 మంది మృతిచెందగా.. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేరళలో ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ప్రకటించారు. పుట్టింగల్‌ ఆలయాన్ని అమిత్‌ షా సందర్శించనున్నారు.

 కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

క్షతగాత్రులకు సహాయక చర్యల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మెడికల్‌ కళాశాలకు చెందిన 10 మంది వైద్య బృందాన్ని కొల్లం పంపింది.

 కేరళ ప్రమాదం

కేరళ ప్రమాదం

ఘటనాస్థలిని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ, మంత్రులు పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచే ప్రదాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలా సహకరిస్తామని ఊమెన్‌ చాందీకి ప్రధాని మోడీ తెలిపారు. మరోవైపు, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

English summary
Prime Minister Narendra Modi, April 10 announced Rs two lakh each as compensation for the next of the kin of the dead in Kollam temple fire in which more than 80 people have been killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X